వివాహేతర సంబంధం అనుమానంతో చెట్టుకు కట్టేసి దాడి: వరంగల్ జిల్లా నర్సంపేటలో ఘటన

వివాహేతర సంబంధం అనుమానంతో చెట్టుకు కట్టేసి దాడి: వరంగల్ జిల్లా నర్సంపేటలో ఘటన

నర్సంపేట, వెలుగు: వివాహేతర సంబంధం అనుమానంతో భార్యతో పాటు మరో యువకుడిని చెట్టుకు కట్టేసి కర్రలతో దాడి చేసిన ఘటన వరంగల్ జిల్లా నర్సంపేటలో శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాలకు చెందిన మిరియాల ఈశ్వరి, నర్సంపేటకు చెందిన మిరియాల గణేశ్​తో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని భర్త శ్రీహరి అనుమానించాడు. ఈ క్రమంలో మూడు రోజుల కింద ఈశ్వరి ఇంటి నుంచి వెళ్లిపోయింది. శుక్రవారం ఉదయం శ్రీహరి తన కొడుకు కిరణ్ తో కలిసి నర్సంపేటకు చేరుకున్నారు.

టౌన్లోని పదో వార్డు సంజయ్ నగర్ లో గణేశ్​ఇంట్లో తన భార్య ఈశ్వరిని గుర్తించాడు. అనంతరం ఈశ్వరి, గణేశ్ ను సమీపంలోని బీసీ హాస్టల్ ఎదురుగా ఉన్న చెట్టుకు కట్టేసి, ఇద్దరూ కలిసి విక్షణారహితంగా కర్రలతో దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను నర్సంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. గణేశ్​తల్లి కళావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.