శ్రీమతిగా ఓటీటీలోకి నివేదా థామస్

శ్రీమతిగా ఓటీటీలోకి నివేదా థామస్

రెండేళ్ల క్రితం ‘35 చిన్న క‌‌‌‌‌‌‌‌థ‌‌‌‌‌‌‌‌కాదు’ చిత్రంతో ఆకట్టుకున్న నివేదా థామస్.. కొంత విరామం తర్వాత మరో ఫ్యామిలీ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ‘శ్రీమతి’ అనే టైటిల్‌‌‌‌‌‌‌‌తో రూపొందిన ఈ లేడీ ఓరియంటెడ్‌‌‌‌‌‌‌‌ మూవీకి విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహించగా కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించారు. థియేటర్స్‌‌‌‌‌‌‌‌లో కాకుండా నేరుగా ఓటీటీ లోకి వస్తోంది.  డిసెంబర్ 4 నుంచి జీ 5 ఓటీటీలో ఇది స్ట్రీమింగ్‌‌‌‌‌‌‌‌ కాబోతోందని  ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆకట్టుకుంది. 

ఇందులో  మధుశ్రీ అనే మిడిల్‌‌‌‌‌‌‌‌ లాస్‌‌‌‌‌‌‌‌ వైఫ్‌‌‌‌‌‌‌‌గా నివేదా కనిపించింది. ఓ వైపు గృహిణిగా కుటుంబ బాధ్యతలను మోస్తూ, మరోవైపు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోసం తపించే పాత్రలో తన నటన ఆకట్టుకుంది. ఓ మహిళ ఆశలు, ఆత్మ గౌరవానికి, కుటుంబ విధేయతకు మధ్య జరిగే మానసిక సంఘర్షణతో ఈ సినిమా ఉండబోతోంది. పెళ్లితో తన కలలకు దూరమైన ఓ ఇల్లాలు తిరిగి వాటిని ఎలా సాకారం చేసుకుంది అనే ఎమోషనల్‌‌‌‌‌‌‌‌ డ్రామా ఇది. తిరువీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హరితేజ,  గోపరాజు రమణ, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో నటించారు.