మంచి సినిమా తీస్తే ఇంత బాగా ఆదరిస్తారా: ఆకాశంలో ఒక తార సక్సెస్పై అల్లు అరవింద్

మంచి సినిమా తీస్తే ఇంత బాగా ఆదరిస్తారా: ఆకాశంలో ఒక తార సక్సెస్పై అల్లు అరవింద్

దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి జంటగా పవన్ సాధినేని తెరకెక్కించిన చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌‌‌‌‌‌‌‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మించారు. గురువారం రాత్రి ప్రీమియర్స్‌‌‌‌‌‌‌‌తో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు నుంచి వస్తున్న రెస్పాన్స్‌‌‌‌‌‌‌‌ తెలియజేయడానికి మేకర్స్‌‌‌‌‌‌‌‌ సక్సెస్ మీట్ నిర్వహించారు.  అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘గురువారం రాత్రి పది గంటల నుంచి నా ఫోన్ మోగుతూనే ఉంది. 

ఇంత అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఒక మంచి సినిమా తీస్తున్నాం అనుకుని సిన్సియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తీశాం. దానికి 10 రెట్లు రెస్పాన్స్ వస్తుంటే నాకు ఒక కొత్త అనుభూతి కలిగింది. ఒక మంచి సినిమా తీస్తే ఇంత బాగా ఆదరిస్తారా అనిపించింది. దర్శకుడు పవన్ సాదినేని నన్ను ఆశ్చర్యపరిచాడు. తన నెక్స్ట్ సినిమా నాతోనే చేయబోతున్నాడు. అలాగే సాత్విక మా సంస్థలో మరో రెండు సినిమాలు చేస్తోంది’ అని చెప్పారు. ప్రేక్షకులు అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారని నిర్మాత అశ్వినీదత్ సంతోషం వ్యక్తం చేశారు.  

డైరెక్టర్ పవన్ సాదినేని మాట్లాడుతూ ‘మేము ఏ ఉద్దేశంతో ఈ సినిమా తీశామో ప్రేక్షకులు అంతే గొప్పగా ఆదరించారు. అల్లు అరవింద్‌‌‌‌‌‌‌‌,  అశ్వనీదత్‌‌‌‌‌‌‌‌ గార్లతో వర్క్ చేయడం, గున్నం గంగరాజు గారు స్క్రీన్‌‌‌‌‌‌‌‌ప్లే రాయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. నటీనటులు, టెక్నీషియన్స్‌‌‌‌‌‌‌‌ అందరికీ థాంక్స్‌‌‌‌‌‌‌‌’ అని చెప్పాడు. గున్నం గంగరాజు తదితరులు పాల్గొన్నారు.