January 12 Vidudala: 'దివ్వికి దివ్వికి' ప్రోమో సాంగ్ రిలీజ్.. 'జనవరి 12 విడుదల'పై జీవీ ప్రకాష్ క్రేజీ కామెంట్స్ !

January 12 Vidudala: 'దివ్వికి దివ్వికి' ప్రోమో సాంగ్ రిలీజ్.. 'జనవరి 12 విడుదల'పై జీవీ ప్రకాష్ క్రేజీ కామెంట్స్ !

టాలీవుడ్‌లో సంక్రాంతి సందడి మొదలుకాకముందే విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్ బాక్సాఫీస్ దగ్గర హాట్ టాపిక్‌గా మారింది. సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ 'జనవరి 12 విడుదల'పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. లేటెస్ట్ గా ఈ సినిమాపై ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి.

ఇటీవల'ఆకాశంలో ఒక తార' చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించి ప్రశంసలు అందుకుంటున్న జీవీ ప్రకాష్.. తన తదుపరి తెలుగు ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 'విశ్వనాథ్ అండ్ సన్స్', 'ఇరుముడి', 'ఆకాశంలో ఒక తార' చిత్రాలకు వస్తున్న స్పందనతో ఆనందంగా ఉన్న ఆయనకు ఓ అభిమాని'జనవరి 12 విడుదల' గురించి ప్రశ్నించాడు. దీనికి స్పందించిన జీవీ ప్రకాష్.. ఈ సినిమా పక్కా బ్లాక్‌బస్టర్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు, ఇప్పటికే సినిమా రెండు గంటల నిడివి చూసినట్లు చెబుతూ అనిల్ రావిపూడి మేకింగ్ స్పీడ్‌ను ప్రత్యేకంగా ప్రశంసించారు.

మరోవైపు లేటెస్ట్ గా ఈ చిత్రంలోని తొలి పాట 'దివ్వికి దివ్వికి' ప్రోమోను మేకర్స్ విడుదల చేసి మ్యూజిక్ ప్రమోషన్లకు తెరలేపారు. ఈ పాటలో అమ్మాయి నేపథ్యంతో కూడిన ప్రత్యేకమైన ట్రీట్ ఉండబోతున్నట్లు ముందస్తు అప్‌డేట్స్ ఆసక్తిని పెంచాయి. జీవీ ప్రకాష్ సంగీతం, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ కలిస్తే పాటలు ఎలా ఉండబోతాయోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

వెంకటేష్, కళ్యాణ్ రామ్ తొలిసారి కలిసి నటిస్తుండటం ఈ సినిమాకు మరింత హైప్ ను తీసుకువచ్చింది.. వీరికి జోడీగా కీర్తి సురేష్, కృతి శెట్టి నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. 2027 జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి జీవీ ప్రకాష్ చెప్పినట్లుగా ఈ సినిమా నిజంగానే బ్లాక్‌బస్టర్ మ్యాజిక్ చేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.