ఒక రాక్షసుడు వేదాద్రి అడవుల్లోకి ప్రవేశించాడు. వాడు మహా తిండిబోతు. దాంతో దొరికిన జంతువుల్ని చంపేవాడు. చెట్లకొమ్మలు విరగ్గొట్టి, చెకుముకి రాళ్ళతో కొమ్మలకు నిప్పు వెలిగించేవాడు. ఆ మంట మీద జంతువుల్ని కాల్చుకుని తినేవాడు. ఆ తిండి వల్ల అడవిలో జంతుజాలం. చెట్లు తగ్గిపోసాగాయి. అదీగాక వాడు పెట్టే మంట వల్ల కాలుష్యం పెరిగింది. అడవిలో ఉండే చిన్నచిన్న జంతువులకు, పక్షులకు బతకడం కష్టమైంది.
చెట్టు మీద ఉండే రామచిలుక పిల్లలకు పొగ వల్ల ఊపిరి తీసుకోవడం కష్టమైంది. ఆ పక్కనే మరో కొమ్మ మీద ఉన్న అడవి పిట్ట రాక్షసుడి బాధ తట్టుకోలేక “వీడి పీడ విరగడైతే గానీ అడవి బాగు పడదు" అన్నది."నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. పొద్దున్నే నాకో ఉపాయం తట్టింది. ఆ పక్క చెట్టు తొర్రలో నా స్నేహితుడు కీచురాయి ఉన్నాడు. రాత్రిళ్ళు వాడి అరుపుల రొద భరించడం కష్టం. రాక్షసుడికి నిద్ర లేకుండా చేస్తే అడవి వదిలి పారిపోతాడు. ఒకవేళ వాడు అడవి పక్కనున్న రాజ్యానికి వెళ్తే, మనుషులు తెలివిగలవారు కాబట్టి వాడ్ని తన్ని తరిమేస్తారు" అని చెప్పింది రామచిలుక.
"నీ ఆలోచన బాగుంది.." అంది.అడవి పిట్ట. వెంటనే రామచిలుక కీచురాయినికలిసింది. "రాక్షసుడి గురించి చెప్పి... నువ్వు నీ ఫ్యామిలీతో కలిసి రాక్షసుడు నిద్రపోతున్నప్పుడు గొంతు పెంచి గోలగోల చెయ్యి. ఆ గోలకి వాడు అడవి వదిలి పారిపోతాడు. నువ్వు ఈ మేలు చేస్తే అడవిలో వాతావరణం. జంతువులు బతికి బట్టకడతాయి". అన్నది రామచిలుక."మా వల్ల అడవి. బాగుపడుతుందంటే అంతకన్నా ఏం కావాలి? ఈ రోజు రాత్రికే వాడికి నిద్ర లేకుండా చేస్తాం. నువ్వు భయపడకు" అని ధైర్యం చెప్పింది కీచురాయి.
రాక్షసుడు ఎక్కడ ఉండేది కీచురాయికి చూపించింది రామ చిలుక. ఆ రాత్రే రాక్షసుడు పడుకున్న దగ్గర రాళ్ళలో దాక్కుని కీచు గొంతుతో అరవడం మొదలుపెట్టాయి. దాంతో రాక్షసుడికి రెండు రాత్రుల నుంచీ నిద్రకరవైంది. ఎంత వెతికినా కీచురాళ్ళు కనబడలేదు వాడికి. ఆ బాధ పడలేక అడవి పక్కనున్న వేదపురం ఊళ్లోకి పారిపోయాడు. రాక్షసుడు నగరంలోకి ప్రవేశించినట్లు రాజుకి తెలిసి, సైన్యంతో దాడి చేసి రాక్షసుడిని కడతేర్చాడు. అంతటితో అడవికి జంతువులకి వాడి పీడ విరగడైంది. రామచిలుక ఉపాయాన్ని, కీచురాళ్ల సాయాన్ని అడవి మొత్తం మెచ్చుకుంది...
