తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. నవంబర్ 20 ఉత్థాన ఏకాదశితో చాతుర్మాసం ముగిసింది. 2026 నవంబర్ 21 నుంచి డిసెంబర్ 15 వరకు 25 రోజుల్లో 52 లక్షల పెళ్లిళ్లు జరగనున్నాయి.కానీ ఈ 25 రోజుల్లో అన్ని రోజులు ముహూర్తాలు లేవు. పంచాంగం ప్రకారం కేవలం 11 రోజులు మాత్రమే శుభ ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.
నవంబర్ 21 శనివారం అత్యంత డిమాండ్ ఉన్న ముహూర్తం. చాతుర్మాస్యం తర్వాత వచ్చిన మొదటి ముహూర్తం కావడంతో ఆ రోజు ఎక్కువ పెళ్లిళ్లు జరుగుతాయి .మళ్లీ డిసెంబర్ 16 నుంచి ధనుర్మాసం మొదలవుతుంది. మళ్లీ జనవరి 15 తర్వాతే పెళ్లిళ్ల ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.
డిసెంబర్ 6 ముహూర్తం కేవలం 42 నిమిషాలే: ఉదయం 7.00 నుంచి 7.42 వరకు మాత్రమే ఉంది. ఆ రోజు పెళ్లి చేసుకునే వారు ముందే ప్లాన్ చేసుకోవాలి.
డిసెంబర్ 11 బెస్ట్ ముహూర్తం: ఈ సీజన్‌లో అత్యంత శక్తివంతమైన ముహూర్తంతెల్లవారు 3 గంటలకే మొదలవుతుందని పండితులు చెబుతున్నారు.
డిసెంబర్ 15 తర్వాత పెళ్లిళ్లు లేవు: డిసెంబర్ 16 నుంచి ధనుర్మాసం మొదలవుతుంది. జనవరి 15, 2027 వరకు శుభకార్యాలు చేయకూడదు.
