ఖ్మమ్మం జిల్లాలో భారీ కొండచిలువ... ఏదో జంతువును తిని కదలలేదని స్థిత్తిలో...

ఖ్మమ్మం జిల్లాలో భారీ కొండచిలువ... ఏదో జంతువును తిని కదలలేదని స్థిత్తిలో...

ఖమ్మం జిల్లా చింతకాని మండలం నేరడ గంగమ్మ గుడి సమీపంలో గల  చేనులో భారీ కొండ చిలువ దర్శనమిచ్చింది. శుక్రవారం ( నవంబర్ 20 ) భారీ కొండ చిలువ ను చూసి రైతు భయంతో బయటకు పరుగు పెట్టాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... పొలంలో భారీ కొండచిలువను చుసిన రైతు  గ్రామ సర్పంచ్ కు తెలుపగా ఆయన ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. 

ఈ క్రమంలో రంగంలోకి దిగిన ఫారెస్ట్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని... స్థానికుల సాయంతో భారీ కొండ చిలువను ఫారెస్ట్ సిబ్బంది పట్టుకున్నారు. అయితే కొండ చిలువ ఏదైనా జంతువు నీ తిని కదలలేని పరిస్థితిలో ఉందని విశ్రాంతి తీసుకునేందుకు చేనులోకి వచ్చి ఉంటుందని ఫారెస్ట్ సిబ్బంది అభిప్రాయ పడుతున్నారు. 

భారీ కొండ చిలువ ను పట్టుకోవడంతో రైతు తో పాటు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే గతంలో ఎన్నడూ కొండ చిలువ ఆనవాలు నేరడ ప్రాంతంలో లేవని ఈ భారీ కొండ చిలువ ఎక్కడనుండి వచ్చిందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానిక ఎన్నికలు.