కోలీవుడ్ స్టార్ ధనుష్, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, లేడీ పవర్‌స్టార్ సాయి పల్లవి, యంగ్ బ్యూటీ శ్రీలీల కలిసి నటించిన క్రేజీ మల్టీస్టారర్ ‘ఓం: ఆపరేషన్ మోల్’ (O.M: Operation Mole) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘అమరన్’ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌పై విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ధనుష్, మమ్ముట్టి తొలిసారి కలిసి నటించడం, సాయి పల్లవి పవర్‌ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించడం సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఓవర్సీస్ ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో రివ్యూలు ఇస్తున్నారు. ఇంతకీ ‘ఓం’ ప్రేక్షకులను మెప్పించిందా? ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవిల నటన ఎలా ఉంది? అనే వివరాలు ట్విట్టర్ టాక్‌లో తెలుసుకుందాం..
‘ఓం’ కథేంటి?
తమిళనాడు–ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ‘ఓం’ కథ సాగుతుంది. అంతర్జాతీయ స్మగ్లింగ్ నెట్‌వర్క్ అధినేత బర్మా కార్తికేయన్‌గా మమ్ముట్టి నటించగా, అండర్‌కవర్ పోలీస్‌గా ధనుష్ ఆ ముఠాలోకి ప్రవేశిస్తారు. ఐపీఎస్ అధికారి నిత్యారెడ్డిగా సాయి పల్లవి ఈ ఆపరేషన్‌కు నాయకత్వం వహిస్తారు. ఇక ధనుష్ భార్య రోజాగా శ్రీలీల కనిపిస్తారు. రహస్య ఆపరేషన్, స్మగ్లింగ్ మాఫియా, కుటుంబ భావోద్వేగాల చుట్టూ కథ ఉత్కంఠభరితంగా సాగుతుంది. అలా స్మగ్లింగ్ మాఫియాను అంతం చేసేందుకు సాయి పల్లవి చేపట్టిన ‘ఆపరేషన్ మోల్’ ఎలా సాగింది? ధనుష్- మమ్ముట్టి పాత్రలతో మూవీ చివరికి ఎలాంటి మలుపులు తీసుకుందనేది మిగతా కథ మిగతా కథ.
#OM First Half Review 🍿 - An Engaging Spy Thriller so far From Rajkumar Periyasamy..🤝 - It's Good to see the Energetic #Dhanush after a while..🔥 #Mammootty's Screen Presence was..👌 - #SaiAbhyankkar's Score..👍💥 - Film slowly and steadily builds up the drama and goes gripping until the interval..👍 - Few lags here and there due to the length but Film was engaging in most part.. - The Single Shot sequence, Alakalova song, Redwood smuggling portions and Pre Interval to interval block stretch were the highlights so far.. - An Unexpected Emotional Interval block..✌️ - Good show So far.. Waiting to see how this drama is gonna turn out in the second half..🤝 - Onto the Second half now..✌️
— Laxmi Kanth (@iammoviebuff007) November 20, 2026
ఆడియన్స్ టాక్ ఇదే..
ధనుష్ ఇంటెన్స్ లుక్, పెర్ఫార్మన్స్, మమ్ముట్టి పవర్‌ఫుల్ ఎంట్రీ, సాయి పల్లవి పోలీస్ ఆఫీసర్ అవతారం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సాయి అభ్యంకర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, థ్రిల్లింగ్ విజువల్స్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. ‘ధనుష్, మమ్ముట్టి కాంబినేషన్ అదిరిపోయింది’, ‘సాయి అభ్యంకర్ మ్యూజిక్ నెక్స్ట్ లెవల్’ అంటూ పలువురు నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. సాయి పల్లవి నటనను స్పెషల్గా మెచ్చుకుంటున్నారు. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, పోలీస్ అధికారిగా కనిపించిన తీరు ఆకట్టుకున్నాయని అంటున్నారు. సెకండాఫ్లో కొన్ని సీన్స్ నెమ్మదిగా సాగినప్పటికీ.. కథలో భాగం అవ్వడంతో మంచి ఫీల్ ఇచ్చిందని అంటున్నారు.
#OM Interval ends on a Highly emotional Block, setting up the sema intresting conflict for the film👏🔥 First half plot is what we have seen in the trailer. Seems there are going to be many interesting things gonna build on 2nd half✌️ https://t.co/zJWV6rj2gY
— AmuthaBharathi (@CinemaWithAB) November 20, 2026
మరోవైపు శ్రీలీల కూడా తన రెగ్యులర్ పాత్రలకు భిన్నమైన లుక్, బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకుంటోందని టాక్ వస్తుంది.. ఇక ఈ సినిమాకు మరో బిగ్గెస్ట్ అట్రాక్షన్ ధనుష్, మమ్ముట్టి కాంబినేషన్. తమ విలక్షణమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ ఇద్దరు స్టార్స్ ఒకే తెరపై కనిపించడంతో ప్రేక్షకుల్లో భారీ థ్రిల్ వస్తుంది. ధనుష్ తన నేచురల్ పెర్ఫార్మెన్స్‌తో, మమ్ముట్టి తన పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో సినిమాకు మరింత వెయిట్ తీసుకొచ్చారని అంటున్నారు. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఆడియన్స్ హై మూమెంట్స్ ఇచ్చేలా ఉన్నాయని ఫస్ట్ రివ్యూలు ద్వారా పంచుకుంటున్నారు.
