నిర్మల్ జిల్లాలో 99 రూపాయలకే కిలో చికెన్.. కూర కోసం ఎగబడ్డ జనం

నిర్మల్ జిల్లాలో 99 రూపాయలకే కిలో చికెన్.. కూర కోసం ఎగబడ్డ జనం

తక్కువ ధరకే చికెన్ దొరుకుతుందంటే ఎవరు ఎందుకు వదులుకుంటారు.. సరిగ్గా నిర్మల్ జిల్లాలో అదే జరిగింది.  ఓ చికెన్ షాపు యజమాని గిరాకీ లేదని.. కేవలం 99 రూపాయలకే కిలో  చికెన్ ఇస్తానని ఆఫర్ పెట్టడంతో జనం ఎగబడ్డారు. చుట్టు పక్కల గ్రామాలనుంచి కూడా వచ్చి చికెన్ కొనుక్కుపోతున్నారు. ఇంతకాలం గిరాకీ లేక  డీలా పడ్డ యజమాని ఒక్కసారిగా గిరాకీ పెరగడంతో సంతోషంతో ఉక్కిరిబిక్కరి అవుతుండగా చికెన్  కోసం పెద్ద ఎత్తున జనం రావడంతో చిన్నపాటి తొక్కిసలాట కూడా జరిగింది.  వివరాల్లోకి వెళితే.. 

నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ లో  ఈ చీప్ రేట్ చికెన్  అమ్మకాలు సాగుతున్నాయి. కార్తీక మాసం కావడంతో  దస్తూరాబాద్ లో చికెన్ అమ్మకాలు తగ్గడంతో.. స్థానిక భారత్ చికెన్ సెంటర్ నిర్వాహకుడికి ఓ ఐడియా వచ్చింది. కార్తీక మాసానికి ముందు రూ 250 కిపైగా కిలో చికెన్ ధర ఉండగా కొనేవాడు లేకపోవడంతో.. కేజీ చికెన్ కేవలం  99 రూపాయలకే ఇస్తానని భారత్ చికెన్ సెంటర్ నిర్వాహకులు ప్రకటించారు. ఇంకేముందు.. జనం ఎగబడ్డారు. 

►ALSO READ | నిండు ప్రాణానికి 3 లక్షలు విలువ కట్టి సెటిల్‌మెంట్.. పరిగి చత్రాజీ ఆసుపత్రిలో ఘటన

కేవలం దస్తూరాబాద్ ప్రజలే కాదు..చుట్టుపక్కల గ్రామాలనుంచి కూడా జనం వచ్చి కేజీ ల కొద్ది చికెన్ కొనుక్కొని వెళ్తున్నారట. ఈ క్రమంలో తోపులాటలు కూడా చోటు చేసుకున్నాయి. చికెన్ కోసం జనం పడిన ఆరాటం చూస్తే ఆఫర్ ఎంతగా ఆకట్టుకుందో అర్థమవుతోంది. సాధారణంగా కార్తీక మాసంలో మాంసాహారానికి దూరంగా ఉండే పరిస్థితి కనిపిస్తే.. ఇక్కడ మాత్రం రూ.99 ఆఫర్‌కు జనం కక్కుర్తి పడుతూ ఎగబడటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.