Netflix Thriller: నెట్‌ఫ్లిక్స్‌ ట్రెండింగ్లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్.. 3 రోజుల్లోనే 32 లక్షల వ్యూస్!

Netflix Thriller: నెట్‌ఫ్లిక్స్‌ ట్రెండింగ్లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్.. 3 రోజుల్లోనే 32 లక్షల వ్యూస్!

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్  ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘దాయిరా’ (Daayra). ఇప్పుడు ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ నెట్‌ఫ్లిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. స్ట్రీమింగ్‌కు వచ్చిన కొద్ది రోజులకే మిలియన్ల కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంటూ గ్లోబల్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా న్యాయం, చట్టం, పోలీసుల అధికారాలు, ప్రజల ఆగ్రహం చుట్టూ అల్లుకున్న కథ ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తోంది.

3 రోజుల్లోనే 32 లక్షల వ్యూస్..

మేఘనా గుల్జార్ దర్శకత్వంలో కరీనా కపూర్, పృథ్వీరాజ్ నటించిన ‘దాయిరా’ నెట్‌ఫ్లిక్స్‌లో దూసుకెళ్తోంది. నవంబర్ 13న స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే 3.2 మిలియన్ల (32 లక్షలు) వ్యూస్, 7.4 మిలియన్ల వాచ్ అవర్స్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉన్న నాన్ ఇంగ్లిష్ సినిమాల జాబితాలో 9వ స్థానంలో నిలిచింది. అంతేకాదు, 14 దేశాల టాప్ 10లో చోటు దక్కించుకోగా, 10 దేశాల్లో నంబర్ వన్‌గా ట్రెండ్ అవుతోంది. థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతోంది. 

2026 బాలీవుడ్ ఓటీటీ చిత్రాల్లోనూ టాప్ 10..

నెట్‌ఫ్లిక్స్‌లో 2026లో విడుదలైన బాలీవుడ్ సినిమాల తొలి వారపు వ్యూస్ ఆధారంగా రూపొందించిన జాబితాలోనూ ‘దాయిరా’ ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ధురంధర్, భూత్ బంగ్లా, మర్దానీ 3, తేరే ఇష్క్ మే వంటి సినిమాలు ముందున్నాయి. కాక్‌టెయిల్ 2, ధమాల్ 4 చిత్రాల కంటే ఎక్కువ వ్యూస్ సాధించడం ఈ సినిమా ఓటీటీ ఆదరణకు నిదర్శనంగా నిలుస్తోంది.

‘దాయిరా’ కథేంటి? ఎందుకీ క్రైమ్ థ్రిల్లర్ ప్రత్యేకం?

ఒకవైపు ప్రజల ఆగ్రహం.. మరోవైపు చట్టం చెప్పే న్యాయం. ఈ రెండింటి మధ్య జరిగే సంఘర్షణే ‘దాయిరా’ కథాంశం. ఓ యువతిపై జరిగిన దారుణ ఘటనలో నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన డీసీపీ రమణ్ కుమార్ (పృథ్వీరాజ్ సుకుమారన్) ప్రజల దృష్టిలో హీరోగా మారతారు. అయితే ఆ ఎన్‌కౌంటర్ వెనుక అనుమానాలు తలెత్తడంతో, నిజానిజాలు తేల్చేందుకు డీసీపీ అజూనీ కోహ్లీ (కరీనా కపూర్ ఖాన్) రంగంలోకి దిగుతారు. ఆమె దర్యాప్తులో బయటపడే నిజాలు, పోలీసు వ్యవస్థలోని పరిణామాలు కథలో ఉత్కంఠను పెంచుతాయి. నేరస్థులకు తక్షణ శిక్ష విధించడమే న్యాయమా? చట్టబద్ధమైన విచారణకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి? అనే ప్రశ్నలను లేవనెత్తడమే ఈ క్రైమ్ థ్రిల్లర్ ప్రత్యేకత.

►ALSO READ | Dhanush: ‘ఓం’ మూవీ రిలీజ్ వేళ.. ఫ్యాన్స్‌కు హీరో ధనుష్ కీలక విజ్ఞప్తి

దిశా ఘటన స్ఫూర్తితో..

2019లో హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన దిశా ఘటన, అనంతరం జరిగిన ఎన్‌కౌంటర్ పరిణామాల స్ఫూర్తితో ‘దాయిరా’ కథను రూపొందించారు. అయితే ఇది యథాతథంగా ఆ ఘటనను చూపించే సినిమా కాదు. న్యాయం, చట్టం, పోలీసు వ్యవస్థ మధ్య ఉండే సంఘర్షణను ఆసక్తికరంగా ఆవిష్కరించే క్రైమ్ డ్రామా. ‘రాజీ’, ‘తల్వార్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించగా.. కరీనా కపూర్, పృథ్వీరాజ్ సుకుమారన్ తొలిసారి కలిసి నటించడం ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ఇద్దరూ పోలీస్ అధికారుల పాత్రల్లో ఆకట్టుకున్నారు.

ఓటీటీలో చూడొచ్చా?

క్రైమ్ థ్రిల్లర్స్, ఇన్వెస్టిగేషన్ డ్రామాలు ఇష్టపడేవారికి ‘దాయిరా’ మంచి ఆప్షన్. ఉత్కంఠభరితమైన కథనం, న్యాయం చుట్టూ సాగే సంఘర్షణ, కరీనా కపూర్–పృథ్వీరాజ్ నటన ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. మేఘనా గుల్జార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.