టెన్నిస్‌లో అదరగొట్టిన లారా దత్తా కూతురు.. యూఏఈ ఛాంపియన్‌షిప్ కైవసం!

టెన్నిస్‌లో అదరగొట్టిన లారా దత్తా కూతురు.. యూఏఈ ఛాంపియన్‌షిప్ కైవసం!

Lara Dutta daughter Saira: భారత టెన్నిస్ దిగ్గజం మహేష్ భూపతి (Mahesh Bhupathi), బాలీవుడ్ నటి లారా దత్తా (Lara Dutta) దంపతుల గారాలపట్టి సైరా భూపతి (Saira Bhupathi) తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ టెన్నిస్ కోర్టులో సత్తా చాటింది. ఇటీవల జరిగిన ఒక టెన్నిస్ టోర్నమెంట్‌లో అద్భుత ప్రతిభ కనబరిచిన సైరా, ఛాంపియన్‌గా నిలిచి ట్రోఫీతో పాటు ప్రైజ్ చెక్‌ను సొంతం చేసుకుంది. తన కూతురి విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ లారా దత్తా సోషల్ మీడియా వేదికగా భావోద్వేగపూరిత పోస్ట్ షేర్ చేసింది.

నాకంటే పొడవుగా ఎదిగింది.. చాలా గర్వంగా ఉంది: లారా దత్తా

టోర్నమెంట్‌కు సంబంధించిన పలు ఆసక్తికర ఫోటోలను లారా దత్తా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. లిఫ్ట్‌లో కూతురితో కలిసి దిగిన మిర్రర్ సెల్ఫీ, టెన్నిస్ కోర్టులో సైరా ఆడుతున్న దృశ్యాలు, అధికారుల చేతుల మీదుగా ట్రోఫీ, ప్రైజ్ చెక్ అందుకుంటున్న ఫోటోలను నెట్టింట పోస్ట్ చేసింది. కానీ, తన కూతురి ప్రైవసీ కోసం అన్ని ఫోటోలలో సైరా ముఖం కనిపించకుండా ఎమోజీలతో కవర్ చేసింది. ఇప్పుడు నాకంటే పొడవుగా ఎదిగిన నా బేబీ గర్ల్‌తో కలిసి టూర్‌కు వెళ్లాను.. విజయంతో తిరిగి వచ్చాం.. చాలా గర్వంగా ఉందంటూ లారా ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది.

12 గ్రాండ్‌స్లామ్‌ల విజేత వారసత్వం: 

లారా - మహేష్ లవ్ స్టోరీ: లారా దత్తా, మహేష్ భూపతి 2011 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు (ముంబైలో సివిల్ మ్యారేజ్, గోవాలో క్రిస్టియన్ సంప్రదాయంలో వేడుక). వీరికి 2012 జనవరిలో సైరా జన్మించింది. భారత్ తరఫున 12 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు (పురుషుల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్) గెలిచిన అత్యంత విజయవంతమైన ఆటగాడిగా మహేష్ భూపతి చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు 14 ఏళ్ల సైరా కూడా టెన్నిస్‌లో రాణిస్తుండటంతో అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

ALSO READ : శివుడి ఢమరుకం ఆకారంలో క్రికెట్ స్టేడియం.. జై షా మాటలకి ఫ్యాన్స్ షాక్?

రామాయణంలో కైకేయి పాత్రలో లారా దత్తా: నితేష్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్రం రామాయణం (Ramayana) మొదటి భాగం నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. రణబీర్ కపూర్ (రాముడు), సాయి పల్లవి (సీత), యశ్ (రావణుడు) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీలో లారా దత్తా కైకేయి పాత్ర పోషించింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. కైకేయిని ఎప్పుడూ విలన్‌గానే చూపిస్తారు. కానీ అయోధ్య రాజకీయాల మధ్య ఒక తల్లిగా తన కొడుకు హక్కుల కోసం పోరాడటమే కాకుండా, రావణ సంహారం అనే దైవ కార్యం నెరవేరడానికి ఆమె ఒక సాధనంగా మారిందని తన పాత్రను లారా సమర్థించుకుంది.