Unique Cricket Stadium: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో నిర్మిస్తున్న అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పనులు తుది దశకు చేరుకున్నాయి. నవంబర్ 18న ఐసీసీ అధ్యక్షుడు జై షా (Jay Shah), బీసీసీఐ ఉన్నతాధికారులతో కలిసి స్టేడియం నిర్మాణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. మైదానం, పిచ్‌లు, డ్రెస్సింగ్ రూమ్‌లు, గ్యాలరీలు, వీఐపీ లాంజ్‌లను తనిఖీ చేశారు. ముఖ్యంగా శివుడి ఢమరుకం ఆకారంలో తీర్చిదిద్దిన మీడియా సెంటర్ జై షాను విశేషంగా ఆకట్టుకుంది. పనుల వేగంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
నవంబర్ 30లోగా పనులు పూర్తి చేయాలని ఆదేశం:
* డెడ్‌లైన్: స్టేడియంలో మిగిలి ఉన్న పెండింగ్ పనులను నవంబర్ 30లోగా పూర్తి చేసి, డిసెంబర్ నాటికి మ్యాచ్‌లకు సిద్ధం చేయాలని అధికారులకు జై షా గడువు విధించినట్లు తెలుస్తోంది.
* పిచ్‌ల తయారీ షురూ: ప్రధాన మైదానంతో పాటు ప్రాక్టీస్ గ్రౌండ్‌లోనూ పిచ్‌ల తయారీ పనులు నవంబర్ 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. పిచ్‌ల నాణ్యతను పరిశీలించిన తర్వాతే మ్యాచ్‌ల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటారు.
శివుడి రూపాలు.. కాశీ సంస్కృతి ఉట్టిపడేలా నిర్మాణం:
* ప్రత్యేక ఆకర్షణలు: ఢమరుకం ఆకారంలో మీడియా సెంటర్, త్రిశూలం ఆకారంలో ఫ్లడ్‌లైట్ టవర్లు, చంద్రవంక తరహా పైకప్పు ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి.
* ఘాట్లు, బిల్వపత్రం: గ్యాలరీలను వారణాసి ఘాట్ల మెట్ల తరహాలో నిర్మిస్తుండగా, బయట భాగంలో బిల్వపత్రం ఆకారంలోని లోహపు పలకలను అమర్చారు.
►ALSO READ | IPL వేలంలో ఈ క్రికెటర్లని కొనేవాళ్లు లేకపోవచ్చు?.. ఆ ఐదుగురు స్టార్లు వీళ్లే!
రూ.450 కోట్లు.. 25 నిమిషాల్లోనే మైదానం సిద్ధం:
* వారణాసిలోని గంజారి ప్రాంతంలో 30 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో సుమారు రూ.450 కోట్ల వ్యయంతో ఈ స్టేడియాన్ని నిర్మిస్తున్నారు.
* స్టేడియం కెపాసిటీ: ఒకేసారి ఈ స్టేడియంలో 30,000 మంది ప్రేక్షకులు కూర్చునే వీలుంటుంది. ప్రధాన మైదానంలో 9 పిచ్‌లు, ప్రాక్టీస్ గ్రౌండ్‌లో 5 పిచ్‌లు సిద్ధం చేస్తున్నారు.
* అత్యాధునిక డ్రైనేజీ: 100 మిల్లీమీటర్ల వర్షం కురిసినా నీటిని వేగంగా బయటకు పంపే డ్రైనేజీ వ్యవస్థ ఉంది. వర్షం ఆగిన 20 నుంచి 25 నిమిషాల్లోనే మైదానాన్ని మ్యాచ్‌కు సిద్ధం చేయగలమని అధికారులు తెలిపారు. డిసెంబర్‌లో స్టేడియం ప్రారంభోత్సవం జరిగే అవకాశం ఉంది.
A new international cricket stadium is taking shape in Kashi! A stadium inspired by the crescent moon adorning Lord Shiva’s head, floodlights rising like Trishuls, and a commentary box shaped like a Damru. Kashi’s Sanatani identity expressed through modern sporting architecture! Obviously, this symbolism may trouble a few self-proclaimed secularists. But here is the fun question: will they refuse to watch a match in this ‘Sanatani stadium’? And if India plays Pakistan or Bangladesh here, will those teams refuse to take the field because the stadium carries the unmistakable cultural imprint of Mahadev’s Kashi? Bolo Bum! Har Har Mahadev!
— Raghunath AS 🇮🇳 (@asraghunath) August 26, 2026
