హైదరాబాద్ బౌలర్ల వైఫల్యం.. విదర్భ చేతిలో 3 వికెట్ల తేడాతో ఓటమి!

హైదరాబాద్ బౌలర్ల వైఫల్యం.. విదర్భ చేతిలో 3 వికెట్ల తేడాతో ఓటమి!

కోల్‌‌‌‌కతా: సయ్యద్‌‌‌‌ ముస్తాక్‌‌‌‌ అలీ టీ20 ట్రోఫీలో హైదరాబాద్‌‌‌‌కు రెండో ఓటమి ఎదురైంది. బ్యాటింగ్‌‌‌‌లో తన్మయ్‌‌‌‌ అగర్వాల్‌‌‌‌ (49), హిమతేజ (41) రాణించినా.. బౌలర్లు నిరాశపర్చడంతో బుధవారం జరిగిన గ్రూప్‌‌‌‌–డి మ్యాచ్‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌ 3 వికెట్ల తేడాతో విదర్భ చేతిలో ఓడింది. టాస్‌‌‌‌ ఓడిన హైదరాబాద్‌‌‌‌ 20 ఓవర్లలో 195/8 స్కోరు చేసింది. అమన్‌‌‌‌ రావు (27), రాహుల్‌‌‌‌ బుద్ది (27)తో సహా మిగతావారు విఫలమయ్యారు. 

సౌరభ్‌‌‌‌ దూబే, యష్‌‌‌‌ కడమ్‌‌‌‌ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత విదర్భ 19.2 ఓవర్లలో 198/7 స్కోరు చేసి నెగ్గింది. కెప్టెన్‌‌‌‌ అథర్వ తైడే (82) ఒంటరి పోరాటం చేయగా, యష్‌‌‌‌ కడమ్‌‌‌‌ (27) అండగా నిలిచాడు. రక్షణ్‌‌‌‌ రెడ్డి, అజయ్‌‌‌‌ దేవ్‌‌‌‌ గౌడ్‌‌‌‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. యష్‌‌‌‌ కడమ్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది.