హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లో తీవ్ర అపరిశుభ్రత, నిబంధనల ఉల్లంఘనలతో నడుస్తున్న 4 రెస్టారెంట్ల ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్సులను టీజీ సేఫ్ సస్పెండ్ చేసింది. వ్యాపారాలు నిలిపివేయాలని ఆదేశించింది. పోలీసులతో కూడిన 5 ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్‌లు క్యూర్ రీజియన్‌లోని 10 హోటళ్లు, హాస్టళ్లలో బుధవారం తనిఖీలు నిర్వహించి, 300 కిలోల పాడైపోయిన ఆహార పదార్థాలను సీజ్ చేశాయి.
సికింద్రాబాద్‌లోని ఆల్ఫా హోటల్, వెంగళరావు నగర్‌లోని పందెం కోడి రెస్టారెంట్, జూబ్లీహిల్స్ లహం హౌస్, గౌలిదొడ్డి స్పైస్ కిచెన్ రెస్టారెంట్లలో పక్షుల రెట్టలు, తుప్పు పట్టిన కత్తులు, కిచెన్‌లోనే వాష్‌రూమ్ ఉండటం గుర్తించి లైసెన్సులు సస్పెండ్ చేశారు. స్విగ్గీ, జొమాటో ప్లాట్‌ఫామ్‌ల నుంచి వీటిని తొలగించేలా టీజీసేఫ్ కమిషనర్‌కు వివరాలు పంపుతున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు లైసెన్స్ లేని కూకట్‌పల్లి న్యూ బ్లూ స్టార్ రెస్టారెంట్, పంజాగుట్ట శ్రీనివాస బాయ్స్ హాస్టల్‌ను అధికారులు మూసివేశారు.
