హైదరాబాద్, వెలుగు: గుజరాత్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(జీపీఎస్సీ)కి చెందిన ఆరుగురు సభ్యుల బృందం బుధవారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ)ని సందర్శించింది. ఈ సందర్భంగా టీజీపీఎస్సీ చైర్మన్ బి.వెంకటేశంతో జీపీఎస్సీ సభ్యులు కె.ఎస్.వాసవ, మయూర్ మెహతా, హెచ్.జె. ప్రజాపతి, దీపక్ రాథోడ్, డాక్టర్ శిశిర్ త్రివేది, డాక్టర్ జ్యోతి అయ్యర్ సమావేశమయ్యారు.
రిక్రూట్మెంట్ ప్రక్రియ, నియామక వ్యవస్థను మరింత బలోపేతం చేసి ఆధునీకరించేందుకు టీజీపీఎస్సీ తీసుకొచ్చిన కీలక సంస్కరణలపై చర్చించారు. ఇరు కమిషన్ల అనుభవాలు, ఉత్తమ విధానాలను పరస్పరం పంచుకున్నారు.
