పాక్ బౌలర్ల ధాటికి లంక బ్యాటర్లు బెంబేలు.. రెండో టెస్టులో ఒత్తిడిలో శ్రీలంక!

పాక్ బౌలర్ల ధాటికి లంక బ్యాటర్లు బెంబేలు.. రెండో టెస్టులో ఒత్తిడిలో శ్రీలంక!

Pakistan vs Sri Lanka: పాకిస్తాన్‌‌‌‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌‌‌‌లో శ్రీలంక బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్‌‌‌‌లోనూ తడబడ్డారు. పాక్‌‌‌‌ బౌలర్లు విజృంభించడంతో.. బుధవారం ఆట ముగిసే టైమ్‌‌‌‌కు లంక రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో 22 ఓవర్లలో 74/3 స్కోరు చేసింది. పసిందు సురియబండార (18 బ్యాటింగ్‌‌‌‌), ధనంజయ డిసిల్వ (24 బ్యాటింగ్‌‌‌‌) క్రీజులో ఉన్నారు. లాహిరు ఉడార (7), దినేశ్‌‌‌‌ చండిమల్‌‌‌‌ (0), కమింద్‌‌‌‌ మెండిస్‌‌‌‌ (16) ఫెయిలయ్యారు. 

సాకిబ్‌‌‌‌ ఖాన్‌‌‌‌, రజావుల్లా, ఆమెర్‌‌‌‌ జమాల్‌‌‌‌ తలా ఓ వికెట్‌‌‌‌ తీశారు. అంతకుముందు 121/3 ఓవర్‌‌‌‌నైట్‌‌‌‌ స్కోరుతో ఆట కొనసాగించిన పాకిస్తాన్‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 87.5 ఓవర్లలో 325 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. గాజి ఘోరీ (54), సాకిబ్‌‌‌‌ ఖాన్‌‌‌‌ (37), రజావుల్లా (42), సౌద్‌‌‌‌ షకీల్‌‌‌‌ (24), సల్మాన్‌‌‌‌ ఆగా (21) రాణించారు. లాహిరు కుమార 5, అసితా ఫెర్నాండో 3 వికెట్లు పడగొట్టారు.