వెల్ ప్లేయిడ్ మహీ.. ధోనీ ఐపీఎల్ రిటైర్‌మెంట్‌పై సచిన్ ఎమోషనల్ పోస్ట్

వెల్ ప్లేయిడ్ మహీ.. ధోనీ ఐపీఎల్ రిటైర్‌మెంట్‌పై సచిన్ ఎమోషనల్ పోస్ట్

Sachin, MS Dhoni: భారత మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) ఐపీఎల్‌కు ఆటగాడిగా వీడ్కోలు పలికిన నేపథ్యంలో క్రికెట్ ప్రపంచం మొత్తం అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఇక నుంచి సీఎస్కే మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్న తలాను ఉద్దేశించి క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) ఎక్స్ (X) వేదికగా భావోద్వేగపూరితంగా పెట్టిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతుంది. ధోనీ కెరీర్ తొలినాళ్ల నాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, అతడితో తనకున్న అనుబంధాన్ని సచిన్ షేర్ చేసుకున్నాడు.

బంగ్లాదేశ్ టూర్‌లోనే ధోనీ ప్రతిభను గుర్తించిన సచిన్: 

ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ కెరీర్ ప్రారంభమైన రోజులను సచిన్ టెండూల్కర్ తన పోస్ట్‌లో కళ్లకు కట్టినట్లు వివరించాడు. బంగ్లాదేశ్ గడ్డపై ధోనీ బ్యాటింగ్ చూసినప్పుడే అతడిలో ఏదో ప్రత్యేకత ఉందని నేను గ్రహించా.. కెరీర్ తొలినాళ్లలో బంగ్లాలో ధోనీ బ్యాటింగ్‌ను చూసిన సందర్భం నాకు ఇప్పటికీ గుర్తుంది.. అతడి బ్యాటింగ్‌లో ఏదో ప్రత్యేకత ఉంది, ముఖ్యంగా బంతిని బలంగా బాదే సామర్థ్యం అసాధారణమని అప్పటి కెప్టెన్ సౌరభ్ గంగూలీతో చెప్పా.. అతడిలో అరుదైన ప్రతిభ ఉందని అప్పుడే అర్థమైందని సచిన్ వెల్లడించాడు. 

నా అంచనాలకు మించి సాధించావు.. వెల్ ప్లేయిడ్ మహీ: 

ఎంఎస్ ధోనీతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకోవడం, 2011 వన్డే వరల్డ్ కప్ సహా భారత క్రికెట్‌లో ఎన్నో మధుర క్షణాల్లో నేను భాగస్వామిని కావడం నిజంగా ఆనందంగా ఉందని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రాసుకొచ్చాడు. ఎంఎస్.. నువ్వు ఏదో గొప్పగా సాధిస్తావని అప్పుడే నమ్మాను.. కానీ, నా అంచనాలకు మించి విజయాలు సాధించావు.. భారత క్రికెట్‌కు నీ వంతు అత్యుత్తమ సేవలు అందించావు.. నీతో కలిసి ఈ జర్నీలో భాగమైనందుకు ఎంతో సంతోషంగా ఉంది.. వెల్ ప్లేయిడ్ మహీ! అంటూ సచిన్ తన పోస్ట్‌ను క్లోజ్ చేసేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.