కోల్ క్వాలిటీ అస్యూరెన్స్ వీక్‌‌‌‌‌‌‌‌లో రామగుండం-3కి ఫస్ట్ప్లేస్

కోల్ క్వాలిటీ అస్యూరెన్స్ వీక్‌‌‌‌‌‌‌‌లో రామగుండం-3కి ఫస్ట్ప్లేస్
  • రెండు, మూడు స్థానాలు దక్కించుకున్న శ్రీరాంపూర్, బెల్లంపల్లి​ఏరియా గనులు

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి కంపెనీలో నిర్వహించిన కోల్ క్వాలిటీ అస్యూరెన్స్ వీక్-2026లో ప్రతిభ కనబర్చిన ఏరియాలకు యాజమాన్యం బుధవారం అవార్డులు అందజేసింది. ఈ నెల 12 నుంచి 18 వరకు సింగరేణి వ్యాప్తంగా అన్ని బొగ్గు గనుల్లో కోల్ క్వాలిటీ అస్యూరెన్స్ వీక్ నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ఇల్లందు క్లబ్‌‌‌‌‌‌‌‌లో ముగింపు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో రామగుండం-3 ఏరియా ఫస్ట్​ప్లేస్, శ్రీరాంపూర్ ఏరియా సెకండ్, బెల్లంపల్లి ఏరియా మూడో స్థానం సాధించాయి.

ఆయా ఏరియాల జీఎంలకు సింగరేణి డైరెక్టర్ (పీఅండ్ పీ) కె.వెంకటేశ్వర్లు చేతుల మీదుగా బహుమతులు, అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో అన్ని ఏరియాల జీఎంలు, క్వాలిటీ వింగ్ ఆఫీసర్లు పాల్గొన్నారు. కాగా, 2025-–26 ఆర్థిక సంవత్సరంలో బొగ్గు నాణ్యతలో శ్రీరాంపూర్, బెల్లంపల్లి ఏరియాలు రెండు, మూడు స్థానాలు సాధించడంపై ఆయా ఏరియాల జీఎంలు మునిగంటి శ్రీనివాస్, రమేశ్ హర్షం వ్యక్తం చేశారు. క్వాలిటీ బొగ్గు ఉత్పత్తితోనే సింగరేణి మనుగడ సాధ్యమని, అందుకోసం ఆఫీసర్లు, ఉద్యోగులు కృషి చేయాలని పేర్కొన్నారు.