వీడియో కాల్‌‌లో నచ్చజెప్పినా.. వినలే.. సరెండర్ కాకుండా మసీదులో నక్కి కాల్పులు

వీడియో కాల్‌‌లో నచ్చజెప్పినా.. వినలే.. సరెండర్ కాకుండా మసీదులో నక్కి కాల్పులు
  • బయటకొచ్చాక టెర్రరిస్ట్​ లతీఫ్ భట్‌‌‌‌ను హతమార్చిన బలగాలు

కుల్గామ్: జమ్మూకశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని కుల్గామ్ జిల్లాలో భద్రతా బలగాలు జరిపిన ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కౌంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లష్కర్​ఎ తైబా టెర్రరిస్ట్ మహమ్మద్ లతీఫ్ భట్(22) హతమయ్యాడు. ఏడాది కింద ఉగ్రవాద బాటపట్టిన లతీఫ్ భట్.. తాజాగా కుల్గామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఓ మసీదులో నక్కి సెక్యూరిటీ బలగాలపైకి కాల్పులకు తెగబడ్డాడు. టెర్రరిస్ట్‌‌‌‌ లతీఫ్​భట్​ను ప్రాణాలతో పట్టుకునేందుకు బలగాలు తీవ్రంగా ప్రయత్నించాయి. మసీదులోని ఫోన్ ద్వారా సెక్యూరిటీ అధికారులు లతీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో వీడియో కాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాట్లాడారు.

 ‘నీకు ఇంకా జీవితం ఉంది.. నువ్వు చాలా చిన్నవాడివని, లొంగిపో..’ అని కోరారు. అయితే, లతీఫ్ వారి అభ్యర్థనను తిరస్కరించాడు. తాను అల్లాహ్​ను కలవాలనుకుంటున్నాను.. తాను చాలా సంతోషంగా ఉన్నానని స్పష్టం చేశాడు. ఎంత నచ్చజెప్పినా వినకుండా బుధవారం తెల్లవారుజామున 2.45 గంటల సమయంలో మసీదు నుంచి బయటకు వచ్చి కాల్పులు జరిపాడు. భద్రతా బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో లతీఫ్‌‌‌‌ మృతి చెందినట్లు కశ్మీర్ పోలీసులు ప్రకటించారు. ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కౌంటర్ స్థలం నుంచి మృతదేహంతోపాటు ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.

డిగ్రీ మధ్యలోనే ఆపేసి కార్పెంటర్​గా..

లతీఫ్​ డిగ్రీ చదువును మధ్యలోనే ఆపేసి, కార్పెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పని చేశాడు. గతేడాది లష్కర్​ఎ తైబాలో చేరాడు. సరిహద్దు అవతలి నుంచి వస్తున్న ఆదేశాలతో కశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పర్యాటకాన్ని, శాంతిభద్రతలను దెబ్బతీసేందుకు పలు ఉగ్రదాడులకు పాల్పడ్డాడు. ఈ నెల 11న అఖ్రాన్ గ్రామంలోని సీఆర్పీఎఫ్ చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోస్ట్ పై దాడితోపాటు జులై 22న అనంతనాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పోలీసు అధికారి హత్య, ఆగస్టు 1న ఇద్దరు వలస కార్మికుల హత్య కేసుల్లోనూ లతీఫ్ ప్రమేయం ఉంది. రెండ్రోజు ల క్రితం జరిగిన ఎదురుకాల్పుల్లో అతని సహచరుడు ఉమర్ నాసిర్ హతమవ్వగా, లతీఫ్ తప్పించుకోగా, తాజాగా బలగాల చేతిలో హతమయ్యాడు. ఎన్​కౌంటర్​తర్వాత ‘మీరు పారిపోవచ్చు.. కానీ, తప్పించుకోలేరు’ అంటూ జమ్మూ కశ్మీర్​ పోలీస్ ​శాఖ ‘ఎక్స్​’లో పోస్టు పెట్టింది.