క్లెయిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సులభంగా అందాలంటే..ముందు జాగ్రత్తలు ముఖ్యం: హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీఎఫ్ఓ సమీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

 క్లెయిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సులభంగా అందాలంటే..ముందు జాగ్రత్తలు ముఖ్యం:  హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీఎఫ్ఓ సమీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • పత్రాల అప్​డేట్​ తప్పనిసరి
  •  నామినీ వివరాలు ఉండాలి 
  • హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీఎఫ్​ఓ సమీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్​, వెలుగు: జీవిత బీమా పాలసీ తీసుకునేటప్పుడు కుటుంబ భవిష్యత్తుకు భరోసా లభిస్తుందని భావిస్తాం.   పాలసీదారుడు మరణించిన తర్వాత కుటుంబ సభ్యులు క్లెయిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకునే సమయంలోనే బీమా సంస్థ ఇచ్చిన హామీ ఎంతవరకు నిలబెట్టుకుంటుందో  తెలుస్తుంది. ఆ సమయంలో కుటుంబం అప్పటికే విషాదంలో ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో క్లెయిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రక్రియ వేగంగా పూర్తయ్యేలా చూడటం బీమా సంస్థల బాధ్యత. హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆపరేటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యోగీశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ విషయంలో పాలసీదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.  

క్లెయిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ముందే వివరాలు సరిచూసుకోండి

ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఏఐ నివేదిక ప్రకారం, 2024–25 ఆర్థిక సంవత్సరంలో జీవిత బీమా సంస్థలు వ్యక్తిగత మరణ క్లెయిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో 97.82 శాతం పరిష్కరించాయి. ప్రైవేటు బీమా సంస్థలు క్లెయిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల రూపంలో రూ.23వేల కోట్లకు పైగా చెల్లించాయి.  క్లెయిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సులభంగా అందాలంటే పాలసీ తీసుకునే సమయంలోనే ఆరోగ్యం, అలవాట్ల గురించి నిజాయతీగా వెల్లడించాలి. తప్పుడు సమాచారం ఇస్తే భవిష్యత్తులో  ఇబ్బందులు రావచ్చు. నామినీ పేరు, ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, చిరునామా, బ్యాంకు ఖాతా వివరాల్లో మార్పులు వచ్చినప్పుడు బీమా సంస్థకు వెంటనే తెలియజేయాలి.  పాలసీ వివరాలను కుటుంబ సభ్యులకు ముందుగానే చెప్పాలి.

క్లెయిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రక్రియ ఇలా సాగుతుంది

పాలసీదారుడు మరణించిన తర్వాత నామినీ బీమా సంస్థకు సమాచారం ఇవ్వాలి. ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బ్రాంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేదా ఏజెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా క్లెయిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభించవచ్చు. పాలసీ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మరణించిన వ్యక్తి పేరు, మరణించిన తేదీ, కారణం వంటి వివరాలు అవసరం. క్లెయిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫారం, డెత్ సర్టిఫికెట్, నామినీ గుర్తింపు, చిరునామా రుజువులు, బ్యాంకు వివరాలు సమర్పించాలి.

 అవసరాన్ని బట్టి వైద్య రికార్డులు, పోలీసు పత్రాలు, పోస్టుమార్టం నివేదిక కూడా అడగవచ్చు. పత్రాలు అందిన తర్వాత బీమా సంస్థ పాలసీ, పత్రాలు, క్లెయిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దారుడి గుర్తింపును పరిశీలిస్తుంది. కొన్ని సందర్భాల్లో అదనపు విచారణ అవసరం కావచ్చు. దీనికి 45 రోజుల వరకు పట్టవచ్చు. అదనపు విచారణ అవసరం లేని చాలా క్లెయిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు సమాచారం అందిన 3 రోజుల్లోనే పరిష్కారమవుతున్నాయని సమీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపారు.