సిద్దిపేటకు సీఎం రేవంత్ రాకతో హరీశ్లో వణుకు: పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్

సిద్దిపేటకు సీఎం రేవంత్ రాకతో హరీశ్లో వణుకు: పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి గురువారం సిద్దిపేటకు వెళ్తుండడంతో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్​రావులో వణుకు మొదలైందని పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ అన్నారు. స్థానిక  ఎమ్మెల్యేగా ఆయన సిద్దిపేట ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని, కేవలం సొంత ఆస్తులు పెంచుకొని, నిత్యం రేవంత్ రెడ్డిపై విషం కక్కడమే పనిగా పెట్టుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బుధవారం ఆయన గాంధీ  భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికైనా హరీశ్ రావుకు సిద్దిపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి, అక్కడ ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలను అందించాలనే తపన ఏమాత్రం ఉన్నా.. సీఎం రేవంత్ రెడ్డిని స్థానిక ఎమ్మెల్యేగా సిద్దిపేటలో కలిసి అక్కడి సమస్యలను చెప్పుకోవాలని కోరారు. రాజకీయ విమర్శలు చేయడం మాని నియోజకవర్గ అభివృద్ధికి సీఎం రేవంత్ తో కలిసి పనిచేయాలని సూచించారు.