ఓటీటీలోకి టబు ఎంట్రీ.. నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్‌ లో పవర్‌ఫుల్ రోల్!

ఓటీటీలోకి టబు ఎంట్రీ.. నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్‌ లో పవర్‌ఫుల్ రోల్!

విలక్షణ నటనతో మూడు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న సీనియర్ నటి టబు, ఇప్పుడు ఓటీటీ వేదికపై తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ప్రతిష్ఠాత్మక నెట్‌‌‌‌ఫ్లిక్స్ ఒరిజినల్ వెబ్ సిరీస్ 'టన్నెల్ మెన్'లో ఆమె పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లో కనిపించబోతున్నారు.  హిందీలో టబు నటిస్తున్న మొట్టమొదటి ఒరిజినల్ స్ట్రీమింగ్ సిరీస్ ఇదే కావడం విశేషం.  భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఆధారంగా  'ది రైల్వే మెన్'  అనే సూపర్ హిట్ సిరీస్ తెరకెక్కించిన దర్శకుడు శివ్ రావైల్ ఈ సిరీస్‌‌‌‌కు షోరన్నర్‌‌‌‌గా, దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

2023 నవంబర్‌‌‌‌లో ఉత్తరాఖండ్‌‌‌‌లోని సిల్క్యారా సొరంగం కూలిపోయిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను 17 రోజుల పాటు శ్రమించి సురక్షితంగా బయటకు తీసుకువచ్చిన సహాయక చర్యల స్ఫూర్తితో ఈ వెబ్‌‌‌‌ సిరీస్‌‌‌‌ను తెరకెక్కిస్తున్నారు. విపత్కర పరిస్థితుల్లో సహాయక బృందాలు చూపిన ధైర్యసాహసాలు, సమష్టి కృషి, ఆశ అనే అంశాల చుట్టూ సాగే కల్పిత డ్రామాగా ఇది రూపొందనుంది.