బాలీవుడ్‌లో ‘ధురంధర్’తో సంచలనం సృష్టించిన హీరో రణ్‌వీర్ సింగ్, దర్శకుడు ఆదిత్య ధర్ మరోసారి చేతులు కలపనున్నారనే వార్తలు సినీ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. ఈసారి వీరిద్దరూ ఓ భారీ పీరియాడిక్ డ్రామా కోసం కలిసి పనిచేయనున్నారు.చంద్రగుప్త మౌర్యుడి జీవిత చరిత్ర ఆధారంగా ఈ పాన్ ఇండియా సినిమా రూపొందించబోతోంది. ఇందులో చాణక్యుడి పాత్రను రణవీర్ సింగ్ పోషించబోతున్నట్టు సమాచారం. అంతేకాదు చంద్రగుప్త మౌర్యుడి పాత్రలో యశ్ పేరు వినిపిస్తోంది.
అయితే ఈ ప్రాజెక్ట్ పై దర్శకుడు ఆదిత్య ధర్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నిజానికి మహాభారతంలోని అశ్వత్థామ పాత్రకు సంబంధించి ‘ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ’ పేరుతో ఓ మైథలాజికల్ యాక్షన్ మూవీ పట్టాలెక్కించాలని ఎప్పటినుంచో ప్లాన్ చేస్తున్నాడు ఆదిత్య ధర్. అలాగే ఓ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా స్క్రిప్ట్ కూడా తన దగ్గర సిద్ధంగా ఉంది. మరి ప్రచారంలో ఉన్నట్టు ‘చంద్రగుప్త మౌర్య’ ప్రాజెక్ట్ ముందుకెళ్తుందా, లేక మరో రెండింటిలో ఏదైనా సెట్స్‌కు వెళ్తుందా అనే ఆసక్తి నెలకొంది. ఏదేమైనా తన కొత్త ప్రాజెక్టు షూటింగ్ 2027లో ప్రారంభమై, 2028లో విడుదలయ్యే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
