ఎంటర్‌టైన్‌మెంట్ అంటే కేవలం వెండితెరపైనే సినిమా మాత్రమే కాదు.. ఇప్పుడు గేమింగ్, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటూ వినోద ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ మారుతున్న ఎంటర్‌టైన్‌మెంట్ రంగానికి హైదరాబాద్‌ను గ్లోబల్ హబ్‌గా నిలబెట్టే లక్ష్యంతో నిర్వహించనున్న 'ఇండియా జాయ్ 2026'కు టాలీవుడ్ తన పూర్తి మద్దతు ప్రకటించింది. ఈ మెగా ఈవెంట్‌ను విజయవంతం చేసేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు ముందుకొచ్చారు.
తెలంగాణ సచివాలయంలో జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు, ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు డి. సురేష్ బాబు, నిర్మాతల మండలి అధ్యక్షుడు సి. కల్యాణ్, దర్శకుల సంఘం అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య, మా ఉపాధ్యక్షుడు మదాల రవి పాల్గొన్నారు. దర్శకులు హరీశ్ శంకర్, సాయి రాజేశ్, నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కూడా ఈ సమావేశానికి హాజరై తమ మద్దతు తెలిపారు.
డిసెంబర్ 7 నుంచి 13 వరకు హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఈ ఏడు రోజుల వేడుకకు లక్ష మందికి పైగా సందర్శకులు, 200 మంది ఎగ్జిబిటర్లు, 100 మందికి పైగా అంతర్జాతీయ పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు వస్తారని అంచనా. నెట్‌ఫ్లిక్స్, డిస్నీ, సోనీ, అడోబ్, యూబిసాఫ్ట్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు కూడా పాల్గొనే అవకాశం ఉండటంతో ఈవెంట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ వేదికపై వీఎఫ్ఎక్స్ సమ్మిట్, హైదరాబాద్ కామిక్ కాన్, ఇండీ గేమ్ ఉత్సవ్, ఓటీటీ పల్స్, హైదరాబాద్ ఏఐ ఫిల్మ్ ఫెస్టివల్‌తో పాటు ఫిల్మ్ మార్కెట్, గేమింగ్, యానిమేషన్, ఈ-స్పోర్ట్స్, క్రియేటర్ కాన్‌క్లేవ్ వంటి కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. సినిమా నిర్మాణం నుంచి డిజిటల్ కంటెంట్, గేమింగ్ వరకు సరికొత్త టెక్నాలజీలను పరిచయం చేయనున్నారు. డిసెంబర్ 8న రెడ్ కార్పెట్ వేడుక జరగనుండగా, డిసెంబర్ 9న ఆస్కార్ విజేత సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి కాన్సర్ట్ అరేనాను ప్రారంభించనున్నారు.
కేవలం వినోదానికే పరిమితం కాకుండా.. అంతర్జాతీయ పెట్టుబడులు, కొత్త టాలెంట్‌కు అవకాశాలు, ప్రపంచ స్థాయి భాగస్వామ్యాలకు 'ఇండియా జాయ్' వేదిక కానుంది. మరి ఈ మెగా ఈవెంట్‌తో హైదరాబాద్ గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ మ్యాప్‌పై ఎలాంటి ముద్ర వేస్తుందో చూడాలి..
The Government of Telangana convened the Executive Committee Meeting of IndiaJoy – Film Sector at the Dr B R Ambedkar Telangana State Secretariat today, bringing together leading Telugu film fraternity members and AVGC-XR industry representatives. Industry leaders Sri Dil Raju, Sri D. Suresh Babu and other prominent personalities, welcomed the initiative and pledged their support to make IndiaJoy held under Invest Telangana Global Summit 2026 a grand success. Sri Anudeep Durishetty, IAS, Joint Secretary, ITEC Dept, said Hyderabad is well placed to take Telangana's Orange Economy global. He invited the Film and Entertainment Industry to participate in the Invest Telangana Global Summit in a big way to take Film, Media and AVGC Industry to Global scale. He also cited the various initiatives of Govt.of Telangana including the upcoming AVGC Policy, Image Towers and sustained support for the creative ecosystem. Sri. Dil Raju, Leading Movie Producer and Chairman, Telangana Film Development Corporation (TGFDC) pledged that the entire movie industry will partner to make the summit a grand success. Leaders from the Film Chamber, Producers Council, Directors Association, Movie Artists Association (MAA) and Telangana VFX, Animation and Gaming Association (TVAGA) expressed their enthusiasm to take IndiaJoy to Global scale. Noted Film Personalities including Director Harish Shankar, Actor Rahul Ravindran, Sri. C. Kalyan, Sri. V. N. Aditya, Dr. Madala Ravi, Sri.Mike Reddy and others participated in the event. @revanth_anumula @OffDSB @sjaju1 @anudeepd7 #InvestTelanganaGlobalSummit2026 #IndiaJoy2026 #Hyderabad #OrangeEconomy #RisingTogether
— IT, Electronics & Communications Dept. Telangana (@ITEC_Telangana) November 16, 2026
