సౌత్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన లేటెస్ట్ తెలుగు మూవీ ‘ఆకాశంలో ఒక తార’. సాత్విక వీరవల్లి హీరోయిన్గా పరిచయమవుతున్న ఈ ఎమోషనల్ డ్రామా నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేయగా.. ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు కూడా ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే అదే రోజున ‘ఓం’ సినిమా కూడా బరిలో ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర ఆసక్తికరమైన పోరు నెలకొంది. మరి ఈ క్లాష్‌లో దుల్కర్ సినిమా ఎలాంటి వసూళ్లు సాధిస్తుంది? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
స్టార్ కాస్ట్‌తో భారీ బడ్జెట్!
దుల్కర్ సల్మాన్, శృతి హాసన్ జోడీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. వీరితో పాటు రుహానీ శర్మ, మురళీ శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పవన్ సాదినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్ బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తుండగా.. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. స్టార్ కాస్ట్, భారీ మేకింగ్ వాల్యూస్‌తో తెరకెక్కిన ఈ సినిమా కోసం మేకర్స్ సుమారు రూ.60 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. నటీనటుల రెమ్యునరేషన్లు, నిర్మాణ వ్యయం, ప్రమోషన్లు కలిపి భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బుకింగ్స్ సైతం ఓపెన్ అయ్యి సాలిడ్ పెర్ఫార్మన్స్ కనిపిస్తుంది.
ట్రైలర్‌తో పెరిగిన బజ్.. ఓటీటీ డీల్‌తో భారీ రికవరీ!
‘ఆకాశంలో ఒక తార’ ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మరోవైపు నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా నిర్మాతలకు కలిసొచ్చింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సుమారు రూ.35 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. ఆడియో రైట్స్ ద్వారా మరో రూ.7 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఓటీటీ, మ్యూజిక్ హక్కులతోనే దాదాపు రూ.42 కోట్లు రికవరీ అయినట్లు ట్రేడ్ టాక్. అంటే రూ.60 కోట్ల బడ్జెట్లో 70 శాతానికి పైగా విడుదలకు ముందే వెనక్కి వచ్చినట్లే!
రిలీజ్‌కు ముందే టేబుల్ ప్రాఫిట్లో నిర్మాతలు?
‘ఆకాశంలో ఒక తార’ ప్రీ రిలీజ్ బిజినెస్ నిర్మాతల్లో జోష్ పెంచుతోంది. సినిమాపై ఉన్న నమ్మకంతో గీతా ఆర్ట్స్ సొంతంగా పంపిణీ బాధ్యతలు చేపట్టినట్లు సమాచారం. నైజాం, ఆంధ్రా, సీడెడ్‌తో పాటు ఇతర దక్షిణాది మార్కెట్లలోనూ గీతా ఫిలింస్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా థియేట్రికల్ వాల్యూ సుమారు రూ.50 కోట్లుగా ట్రేడ్ వర్గాల అంచనా. నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారా ఇప్పటికే భారీ మొత్తం రికవరీ కావడంతో నిర్మాతలకు రిలీజ్‌కు ముందే మంచి బిజినెస్ బూస్ట్ లభించినట్లు తెలుస్తోంది.
బాక్సాఫీస్ టార్గెట్ రూ.100 కోట్లు..!
ప్రీ రిలీజ్ బిజినెస్‌తో అదరగొట్టిన ‘ఆకాశంలో ఒక తార’కు ఇప్పుడు బాక్సాఫీస్ అసలైన సవాల్ విసురుతోంది. ట్రేడ్ అంచనాల ప్రకారం అన్ని భాషల్లో కలిపి సుమారు రూ.50 కోట్ల షేర్ సాధిస్తేనే బ్రేక్ ఈవెన్ చేరుకునే అవకాశం ఉంది. అంటే వరల్డ్‌వైడ్‌గా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది. మరి ట్రైలర్‌తో పెరిగిన క్రేజ్‌ను థియేటర్లలో వసూళ్లుగా మార్చి దుల్కర్ సల్మాన్ ఈ టార్గెట్‌ను అందుకుంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
ఓం’తో బాక్సాఫీస్ క్లాష్.. పైచేయి ఎవరిదో?
నవంబర్ 20న ‘ఆకాశంలో ఒక తార’కు ‘ఓం’ సినిమా రూపంలో గట్టి పోటీ ఎదురుకానుంది. ఒకవైపు దుల్కర్ సల్మాన్ స్టార్డమ్, ఎమోషనల్ కంటెంట్‌తో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతుండగా.. మరోవైపు ‘ఓం’ కూడా బాక్సాఫీస్ బరిలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. దీంతో ఈ రెండు సినిమాల మధ్య పోటీపై ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది. మరి ప్రేక్షకులు దేనికి పట్టం కడతారో చూడాలి!
టెక్నికల్ టీమ్ కూడా అదుర్స్!
సాంకేతికంగా కూడా ‘ఆకాశంలో ఒక తార’ బలమైన టీమ్‌తో తెరకెక్కింది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించగా, సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. గుణ్ణం గంగరాజు రచన, స్క్రీన్‌ప్లే అందించగా.. పవన్ సాదినేని, వసంత్ జుర్రు కథను రూపొందించారు. శ్వేతా సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరించారు.
మొత్తంగా ట్రైలర్ బజ్, భారీ ప్రీ రిలీజ్ బిజినెస్‌తో మంచి హైప్ క్రియేట్ చేసిన ‘ఆకాశంలో ఒక తార’ ముందు ఇప్పుడు రూ.100 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్ ఉంది. దుల్కర్ సల్మాన్ తన స్టార్డమ్తో ఈ మార్కును అందుకుంటారా? ‘ఓం’ పోటీని తట్టుకుని బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. నవంబర్ 20న ఈ రెండు సినిమాల బాక్సాఫీస్ ఫలితం ఎలా ఉండబోతోందో చూడాలి!
