జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. సూర్య భగవానుడు గ్రహాలకు రాజుగా వ్యవహరిస్తాడు. సూర్యుడు నాయకత్వ లక్షణాలకు ఆధిపత్యం వహిస్తాడు. నిర్దిష్ట కాల వ్యవధిలో సూర్యుడు తన రాశులను, నక్షత్రాలను మారుస్తుంటాడు. ప్రస్తుతం విశాఖ నక్షత్రంలో సంచరిస్తున్న సూర్య భగవానుడు నవంబర్ 19 వ తేది మధ్యాహ్నం 01:34 గంటల నుంచి డిసెంబర్ 3 వరకు అనురాధ నక్షత్రంలోసంచరించనున్నాడు. సూర్య సంచారంలో జరిగే ఈ మార్పు వల నాలుగు రాశుల వారు నక్క తోకతొక్కినట్టేనని పండితులు చెబుతున్నారు . ఇప్పుడు ఆ రాశుల గురించి తెలుసుకుందాం. . .!
మేష రాశి : సూర్య సంచారంలో ( అనూరాధ నక్షత్రంలోకి ప్రవేశం) మార్పు ఈ రాశి వారికి అన్ని విధాల శుభం కలుగుతుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. వ్యాపారస్తులకు అన్ని విధాలుగా కలిసి రావడంతో ఊహించని లాభాలు అందుకుంటారు.. పాతబాకీలు వసూలవుతాయి. కెరీర్ పరంగా సమస్యలు తొలగిపోతాయి.. గతంలో పెండింగ్ లో ఉన్న పనులు పరిష్కారమవుతాయి. పెళ్లి కోసం ఎదురుచూసే వారికి అనుకున్న సంబంధం నిశ్చయం అవుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడంతో ఎలాంటి పని అయినా సులువుగా పూర్తి చేయగలుగుతారు. ఇక ఉద్యోగస్తుల విషయానికొస్తే.. ఆఫీసులో మీరు ప్రత్యేక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఉన్నతాధికారులతో చర్చలు సఫలం అవుతాయి. మీకు ఆకర్షణ పెరగడంతో పాటు .. మీరు తీసుకొనే నిర్ణయాన్ని ఆఫీసులో అందరూ అమలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని పండితులు చెబుతున్నారు.
మిథున రాశి : సూర్యుడు అనూరాధ నక్షత్రంలో సంచారం వలన ఈ రాశి వారి జీవితం అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. . వృత్తి ఉద్యోగాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతు పూర్తిగా లభిస్తుంది. గతంలో విబేధించిన వారు ఇప్పుడు మీ దగ్గరికే వస్తారు. వ్యాపారస్తులకు .. చేతి వృత్తుల వారికి అనుకోని లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు.. కార్యాలయంలో మీరే ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. కొత్త వ్యాపారాలు .. ప్రాజెక్ట్లు ప్రారంభించే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
కన్య రాశి: గ్రహాల రాజు సూర్యుడు అనూరాధ నక్షత్రంలో సంచారం వలన ఈ రాశి వారికి స్వర్ణయుగం ప్రారంభమవుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు ఏర్పడుతాయి. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ లభిస్తుంది. చేతి వృత్తుల వారికి అనుకోకుండా ఆర్డర్లు వస్తాయి. కొత్త పనులు ప్రారంభించేందుకు ఇది చాలా మంచి సమయమని జ్యోతిష్యపండితులు చెబుతున్నారు. ఎంతో కాలంగా వేధిస్తున్న పరిష్కారం లభించడంతో మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. వ్యాపారస్తులు ఒక్కసారిగా లాభాల బాటలో పయనిస్తారు. పూర్వీకుల ఆస్తి కలసి వస్తుంది. కెరీర్ లో ఉన్నతస్థానం పొందుతారు. స్నేహితులు.. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రమోషన్ తో పాటు వేతనం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగం మారాలనే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు చేపట్టిన అన్ని పనులు పూర్తికావడంతో ఉత్సాహంగా గడుపుతారు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలిసి వస్తాయి.
మీన రాశి: సూర్యుడు అనూరాధ నక్షత్రంలో సంచారం వలన ఈ రాశి వారికి పురోగతికి మార్గాలు తెరుచుకుంటాయి. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని మీరు పొందుతారు. చాలా కాలంగా అప్పుల్లో లేదా పెట్టుబడి పెట్టిన డబ్బులో చిక్కుకున్న వారికి త్వరలో ఉపశమనం లభిస్తుంది. పాత బకాయిలు వసూలవుతాయి. అదృష్టం మీ తలుపు తట్టే అవకాశం ఉంది. ఎన్నడూ చూడని ఆర్థిక లాభాలు ఉంటాయి. ముఖ్యమైన ఆర్థిక అవసరాలు తీరిపోవడంతో పాటు ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ధి చెందు తాయి.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
