ఒక్కటైన తేజా స‌‌‌‌జ్జా మౌర్య జంట.. నిశ్చితార్థ వేడుకకు సినీ ప్రముఖుల సందడి

ఒక్కటైన  తేజా స‌‌‌‌జ్జా మౌర్య జంట.. నిశ్చితార్థ వేడుకకు సినీ ప్రముఖుల సందడి

యువహీరో తేజా స‌‌‌‌జ్జా ఓ ఇంటివాడు అవబోతున్నాడు. త్వరలో తన బ్యాచిలర్ జీవితానికి ముగింపు పలికి పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమయ్యాడు. సోమవారం మౌర్యతో తేజ వివాహ నిశ్చితార్థం ఓ ప్రైవేట్‌‌‌‌ హోటల్‌‌‌‌లో గ్రాండ్‌‌‌‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మంత్రి సీతక్క, హరీష్‌‌‌‌ రావు,  గంటా శ్రీనివాసరావు హాజరయ్యారు.  

తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి  చిరంజీవి, దర్శకులు కె. రాఘవేంద్రరావు, బి.గోపాల్, నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు,  నటులు రవితేజ, శ్రీకాంత్, నాని, రానా దగ్గుబాటి, వరలక్ష్మి శరత్ కుమార్, నిధి అగర్వాల్, నిహారిక కొణిదెల, రితికా నాయక్, ఇమాన్వి, దర్శకులు అనిల్ రావిపూడి పాల్గొన్నారు. డిసెంబ‌‌‌‌ర్‌‌‌‌లో రాజ‌‌‌‌స్థాన్‌‌‌‌లోని ఉద‌‌‌‌య్‌‌‌‌పూర్‌‌‌‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది.