- హాస్టల్స్ తెరిచి కరెంటు, నీళ్ల సప్లైకి డిమాండ్
ఓయూ,వెలుగు: ఓయూలోని ఈ1, ఈ2, డి హాస్టళ్లకు కరెంట్, , నీటి సరఫరాను పునరుద్ధరించాలని, హాస్టల్స్ కూల్చివేతను ఆపెయ్యాలని విద్యార్థులు, నాన్ బోర్డర్స్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఎదుట సోమవారం మౌన దీక్షకు దిగారు. ఈ దీక్షకు మద్దతు తెలిపిన ఎమ్మెల్సీ అభ్యర్థి అశోక్ మాట్లాడుతూ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కనీస వసతులు కల్పించకుండా ఇబ్బందులకు గురిచేయడం అన్యాయమన్నారు.
ముఖ్యమంత్రి ప్రకటించిన రూ.వెయ్యి కోట్ల నిధులను విడుదల చేసి, కొత్త హాస్టల్స్, ఆధునిక ల్యాబ్లు, మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. జంగయ్య, ఇంద్రా నాయక్, క్రాంతి, శ్రీశైలం, వంశీ, వెంకటేష్ పాల్గొన్నారు.
