కార్తీక సోమవారం బంగారం క్రాష్.. కేజీకి రూ.5వేలు తగ్గిన వెండి రేట్లు..!

కార్తీక సోమవారం బంగారం క్రాష్.. కేజీకి రూ.5వేలు తగ్గిన వెండి రేట్లు..!

బంగారం, వెండి రేట్లు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. దీపావళి పండుగ ముగిసిన తర్వాతి నుంచి ఈ పతనం నిరంతరం కొనసాగుతోంది. అంతర్జాతీయంగా రాజకీయ, భౌగోళిక పరిస్థితులు నెమ్మదిగా దారిలోకి వస్తుండటమే దీనికి ప్రధాన కారణంగా బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ రేట్ల తగ్గుదలను క్యాష్ చేసుకుందాం పెళ్లిళ్లు, ఫంక్షన్ల కోసం షాపింగ్ చేద్దాం అనుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుగా తమ నగరాల్లో తగ్గిన ధరలను పరిశీలించటం బెటర్. 

నవంబర్ 16న బంగారం రేట్లు తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు 82 రూపాయలు తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.13వేల 680గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.12వేల 540గా కొనసాగుతోంది. 

సోమవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. నవంబర్ 16, 2026న దేశవ్యాప్తంగా కేజీకి రూ.5వేలు తగ్గింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కూడా స్వచ్ఛమైన వెండి కేజీకి రూ.లక్షా 90వేలుగా కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.190 దగ్గర ఉంది. భవిష్యత్తులో రేట్లు ఇంకా తగ్గొచ్చని బులియన్ వ్యాపారుల అంచనా.