ప్రేమ, స్నేహం, సాహసాల సమ్మేళనం.. 'హార్ట్స్ అక్రాస్ ది సీ'  ప్రత్యేక ప్రీమియర్  

ప్రేమ, స్నేహం, సాహసాల సమ్మేళనం.. 'హార్ట్స్ అక్రాస్ ది సీ'  ప్రత్యేక ప్రీమియర్  

రిట్జ్ ఆర్ట్ హౌస్  నిర్మించిన యానిమేటెడ్ షార్ట్ ఫిలిం 'హార్ట్స్ అక్రాస్ ది సీ'  ప్రత్యేక ప్రీమియర్ హైదరాబాద్‌‌‌‌లోని ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్స్ జరిగింది.   రచయిత విజయేంద్ర ప్రసాద్ ప్రీమియర్‌‌‌‌‌‌‌‌కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

 డా.అపర్ణ వొల్లూరు మూలకథ, పాత్రల ఆధారంగా ఆంటోనియో ఆండ్రియాజ్జో దర్శకత్వంలో రూపొందిన ఈ 24 నిమిషాల చిత్రం అమెరికాలోని ఒరెగాన్ నుంచి ఇటలీలోని వెరోనా వరకు సాగే ప్రేమ, స్నేహం, సాహసాల భావోద్వేగ ప్రయాణాన్ని ఆవిష్కరిస్తుంది.  మానవ కళాకారుల సృజనకు ఏఐ సాంకేతికతను జోడించి రూపొందించడం ఈ చిత్ర ప్రత్యేకత అని,  చిన్నారులు, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని మేకర్స్ తెలియజేశారు.