నైట్‌‌లైఫ్‌‌కు సరికొత్త జోష్..హైదరాబాద్‌లో మరో భారీ రూఫ్‌టాప్ మైక్రోబ్రూవరీ

నైట్‌‌లైఫ్‌‌కు సరికొత్త జోష్..హైదరాబాద్‌లో మరో భారీ రూఫ్‌టాప్ మైక్రోబ్రూవరీ
  • హైదరాబాద్‌‌లో రూఫ్‌‌టాప్ మైక్రోబ్రూవరీ 'హాప్సిటీ' ప్రారంభం

హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్‌‌లోని కొండాపూర్ శరత్ సిటీ క్యాపిటల్ మాల్ వద్ద 500 మందికి పైగా కూర్చునే సామర్థ్యంతో అతిపెద్ద రూఫ్‌‌టాప్ మైక్రోబ్రూవరీ 'హాప్సిటీ బ్రూ కో.' ప్రారంభమైంది. టాలీవుడ్, బాలీవుడ్, టెక్నో సంగీత ప్రియుల కోసం 'ఫైర్‌‌ఫ్లై', 'బాయిలర్‌‌మేకర్' వంటి మూడు ప్రత్యేక వినోద జోన్లతో పాటు లైవ్ స్పోర్ట్స్ వీక్షించేందుకు భారీ స్క్రీన్‌‌ను ఏర్పాటు చేశామని హాప్సిటీ ఫౌండర్ వీ. సురేష్ బాబు, బ్రూవర్ కార్తీక్ సింగ్ తెలిపారు. ప్రతిరోజూ మధ్యాహ్నం రూ. 899 కే 80+ వంటకాల లంచ్ బఫే, అలాగే సాయంత్రం 7 గంటల వరకు డ్రింకులపై 50శాతం వరకు డిస్కౌంట్స్ ఇస్తున్నామన్నారు.