కారు టైరు పేలి..ఆటోను ఢీకొట్టి.. ప్రమాదంలో వికారాబాద్జిల్లాలో ఇద్దరు కన్నుమూత

కారు టైరు పేలి..ఆటోను ఢీకొట్టి.. ప్రమాదంలో వికారాబాద్జిల్లాలో ఇద్దరు కన్నుమూత

 వికారాబాద్​, వెలుగు : వికారాబాద్​ జిల్లా బొంరాస్‌‌‌‌‌‌‌‌పేట్ పీఎస్​ పరిధిలోని అనంతాపూర్ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చనిపోగా, మరో ఏడుగురు గాయపడ్డారు. దుద్యాల మండలంలోని లగచర్లకు చెందిన బుడత శ్రీశైలం (23) తన కారులో తుంకిమెట్ల నుండి హకీంపేట్ వైపు వెళ్తున్నాడు. అదే టైంలో ఎదురుగా హకీంపేట్ నుంచి తుంకిమెట్ల వైపు ఎనిమిది మందితో (డ్రైవర్‌‌‌‌‌‌‌‌తో సహా) ప్యాసింజర్ ఆటో వస్తోంది. 

అనంతాపూర్ సమీపంలో కారు అతివేగంగా వెళ్తుండగా ఎడమవైపు ముందు టైరు పేలిపోయింది. డ్రైవర్ ​వెహికల్​పై అదుపు కోల్పోయి ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టాడు. కారు డ్రైవర్ బుడత శ్రీశైలం, ఆటోలో ప్రయాణిస్తున్న బిహార్ కు చెందిన మరొకరు అక్కడికక్కడే చనిపోయారు. ఆటో డ్రైవర్​ సహా ఆరుగురు గాయపడగా కొడంగల్ ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్​ఐ బాల వెంకట రమణ తెలిపారు. 

మూడేండ్ల బాలుడికి తీవ్ర గాయాలు.. 

ఘట్​కేసర్/గండిపేట  : ఘట్​కేసర్ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కారు ఢీకొని రోడ్డు దాటుతున్న మూడేండ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. అంకుషాపూర్​కు చెందిన కాసుల సంపత్ తన మూడేండ్ల కవల పిల్లలు ఉద్దీరన్, ఉజ్జయిన్, బావమరిదితో కలిసి ఘట్​కేసర్​బస్టాండ్ సమీపంలోని మసీదు వద్దకు వచ్చాడు. ఉజ్జయిన్ టాయిలెట్​ కోసం తన మామతో రోడ్డు అవతలి వైపునకు వెళ్లి తిరిగి వస్తుండగా ఘట్​కేసర్ ​పోస్టాఫీసు వైపు నుంచి మెయిన్​రోడ్డు వైపు వస్తున్న కారు ఢీకొట్టింది. ఉజ్జయిన్​ గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డాడు. కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. అలాగే, శివరాంపల్లి 274 పిల్లర్ వద్ద ఓవర్​స్పీడ్​తో వచ్చిన ర్యాపిడో బైక్ అదుపుతప్పి ఆర్టీసీ బస్సు కిందకు దూసుకెళ్లడంతో బైక్​ నడుపుతున్న యువకుడితో పాటు వెనక కూర్చున్న మహిళ గాయపడ్డారు. 

షాద్​నగర్​లో ఇంటర్​ స్టూడెంట్​

షాద్ నగర్ : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపంలో ఓల్డ్​నేషనల్​హైవేపై రెడ్ రోజ్ ఫంక్షన్ హాల్ ముందర జరిగిన రోడ్డు ప్రమాదంలో షాబాద్ మండలం నాగర్ గూడకు చెందిన ప్రణయ్(16) చనిపోయాడు. ఇతడు షాద్ నగర్ లోని బీసీ హాస్టల్​లో ఉంటూ ఇంటర్​ఫస్టియర్​చదువుతున్నాడు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి ఉంటుందని అనుమానిస్తున్నారు. హాస్టల్ లో ఉంటున్న ప్రణయ్ బయటికి ఎందుకు వచ్చాడు? ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.