సాధ్వీ దీక్ష స్వీకరించిన సంజన

సాధ్వీ దీక్ష స్వీకరించిన సంజన

బేగంబజార్, వెలుగు : ఎంబీఏ పూర్తి చేసి, ఫ్యాషన్‌‌‌‌‌‌‌‌ డిజైనర్‌‌‌‌‌‌‌‌గా, బొటిక్‌‌‌‌‌‌‌‌ యజమానిగా గుర్తింపు పొందిన 25 ఏళ్ల సంజన లునావత్‌‌‌‌‌‌‌‌ విలాసవంతమైన జీవితాన్ని వదిలి ఆదివారం జైన సాధ్వీ దీక్ష స్వీకరించారు. ఈ కార్యక్రమం నాంపల్లి ఎగ్జిబిషన్‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్స్‌‌‌‌‌‌‌‌లో జ్ఞానచంద్రజీ మహారాజ్‌‌‌‌‌‌‌‌ సాహెబ్‌‌‌‌‌‌‌‌ మార్గదర్శకత్వంలో నిర్వహించగా, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఐదు వేల మందికి జైన భక్తులు హాజరయ్యారు. 

మహోత్సవ చైర్మన్‌‌‌‌‌‌‌‌, ముఖ్య కన్వీనర్‌‌‌‌‌‌‌‌ స్వరూప్‌‌‌‌‌‌‌‌చంద్‌‌‌‌‌‌‌‌ కోఠారి మాట్లాడుతూ మహారాష్ట్రలోని జల్గావ్‌‌‌‌‌‌‌‌ జిల్లా భడ్గావ్‌‌‌‌‌‌‌‌కు చెందిన సంజన మూడేళ్లుగా మానసికంగా, ఆధ్యాత్మికంగా సిద్ధమైన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. సంజన మాట్లాడుతూ తనకు 12 ఏండ్ల వయస్సు నుంచే జైన తత్వశాస్త్రం, ధార్మిక బోధనలపై ఆసక్తి ఏర్పడిందని, కాలక్రమేణా ఆ ఆసక్తి మరింత పెరిగి సాధ్వీ జీవితాన్ని స్వీకరించాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు.