గండిపేట, వెలుగు : ఆర్బీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకున్న ప్రొబేషనరీ డీఎస్పీలు పోలీసింగ్‌లో అత్యాధునిక విధానాలు, ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేసేందుకు ఈనెల 16 నుంచి కొనసాగనున్న వారం రోజుల ‘భారత్ దర్శన్’ స్టడీ టూర్‌కు ఆదివారం మూడు బృందాలుగా బయలుదేరారు.
ఒక బృందం మహారాష్ట్రలోని పూణే, ముంబై, నాసిక్ నగరాలను, రెండో బృందం కర్ణాటకలోని మైసూర్, బెంగళూరు నగరాలను, మూడో బృందం తమిళనాడులోని చెన్నై నగరాన్ని సందర్శించనున్నాయి. కాగా, గ్రూప్-1 ద్వారా ఎంపికైన పోలీసు అధికారుల శిక్షణలో ఇలాంటి టూర్ ఏర్పాటు చేయడం రాష్ట్రంలో ఇదే మొదటిసారి కాగా, అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్ ప్రత్యేక చొరవతో ఈ వినూత్న కార్యక్రమానికి రూపకల్పన చేశారు.
