India vs Pakistan U19 final: అండర్-19 ఆసియా కప్ 2026 ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై టీమిండియా సాధించిన థ్రిల్లింగ్ విక్టరీ అనంతరం భారత ఆటగాళ్లు చేసుకున్న సంబరాలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. బౌండరీ లైన్ దగ్గర పాక్ అభిమానుల వైపు దూసుకెళ్తూ ఇండియన్ కుర్రాళ్లు చూపించిన అగ్రెషన్ పై కొందరు విమర్శలు చేస్తుండగా.. ఇప్పుడు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తమ యువ ఆటగాళ్లకు పూర్తి అండగా నిలిచింది. ఓడిపోయే స్థితి నుంచి గెలిచినప్పుడు ఆ మాత్రం సంబరాలు చేసుకోవడంలో తప్పేమీ లేదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా (Devajit Saikia) తేల్చి చెప్పారు.
ఈ మాత్రం సెలబ్రేట్ చేసుకోకపోతే ఎలా: బీసీసీఐ
ఒమన్‌లోని అల్ అమెరాత్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగిన ఫైనల్లో 338 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ చివరి బంతికి 1 వికెట్ తేడాతో (339/9) సంచలన విజయం సాధించింది. గెలుపు తర్వాత ఆటగాళ్ల దూకుడు సంబరాలపై మీడియా అడిగిన ప్రశ్నకు దేవజిత్ సైకియా ఘాటుగా బదులిచ్చారు.. ఆ సంబరాలు మన కుర్రాళ్ల వ్యక్తిత్వాన్ని, పోరాట పటిమను (Fighting Spirit) ప్రతిబింబిస్తున్నాయి. ఆ మ్యాచ్ ఎంత ఉత్కంఠభరితంగా కొనసాగిందో ఒక్కసారి ఆలోచించండి. ఒకానొక దశలో భారత్ గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు., అయినా సరే, ఎప్పటికీ తలవంచని (Never-say-die) మనస్తత్వంతో వారు గెలిచారు. అలాంటి విజయం సాధించినప్పుడు ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకునే అర్హత వారికి ఉంది.. దాన్ని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాల్సిందేనని సైకియా స్పష్టం చేశారు.
ఇప్పుడే డబ్బు ప్రస్తావన వద్దు: దేవజిత్ సైకియా
అండర్ 19 ఆసియా కప్ గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ భారీగా నగదు బహుమతి (Cash Bonus) ప్రకటించనుందన్న ప్రచారాన్ని దేవజిత్ సైకియా కొట్టిపారేశారు. వారు ఇంకా క్రికెట్‌లో ఓనమాలు నేర్చుకుంటున్న యువ ఆటగాళ్లు.. దయచేసి ఇప్పుడే ప్రైజ్ మనీ, రివార్డుల వంటి అంశాలను తీసుకురావద్దు.. వారు పూర్తిగా తమ ఆటను మెరుగుపరుచుకోవడంపైనే దృష్టి పెట్టాలి.. ప్రైజ్ మనీ సంపాదించడానికి వారికి ముందు ముందు జీవితమంతా ఉంది.. కానీ ఈరోజు వారు సంపాదించిన అనుభవం, ఆత్మవిశ్వాసం వారి భవిష్యత్ కెరీర్‌కు కొండంత బలాన్ని ఇస్తాయి.. అంతకంటే విలువైనది మరొకటి లేదని సైకియా పేర్కొన్నారు.
9వ సారి ఛాంపియన్‌గా భారత్:
ఈ విజయంతో భారత్ రికార్డు స్థాయిలో 9వ సారి అండర్19 ఆసియా కప్ టైటిల్‌ను (చివరిసారిగా 2021లో గెలిచింది) ముద్దాడింది. ఫైనల్ ఛేదనలో కీలక ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ లక్ష్య రాయచందానీ (80), ఆర్యవీర్ సెహ్వాగ్ (58), మెరుపు ఇన్నింగ్స్‌తో ఆశలు నిలిపిన మనల్ చౌహాన్ (47), ఆఖరి బంతికి బౌండరీ బాది గెలిపించిన మోహిత్ ఉల్వా (49 నాటౌట్), చివర్లో అండగా నిలిచిన వెంకట (11 నాటౌట్) లను బీసీసీఐ ప్రత్యేకంగా అభినందించింది.
#WATCH | Bali: BCCI Secretary Devajit Saikia said, "These are still young players—please don’t bring up topics like prize money or financial rewards; they should be focusing entirely on their game. They will have their whole lives to earn prize money, but the experience and confidence they’ve gained today will serve as a massive impetus for their future careers. Nothing could be more valuable than that..." When asked about the aggressive celebration of the Indian cricket team after winning, he said, "That reflects their character and fighting spirit. Consider how much of a cliffhanger today’s match was—at one point, it really didn't look like it was in India’s favour... Yet, India managed to win. This speaks volumes about the team's confidence level and their 'never-say-die' attitude. When they win a match from such a difficult position, they certainly deserve to celebrate; that’s something we must allow..." (14.11)
— ANI (@ANI) November 15, 2026
These scenes involving the Indian cricket team are not a reflection of sportsmanship but of a deeply disturbing mindset that has no place in cricket. Such behaviour disgraces the spirit of the game. #CricketDied #Lanat https://t.co/N75taZfVBr
— Ammar Masood (@ammarmasood3) November 14, 2026
