Gautam Gambhir: అండర్-19 ఆసియా కప్ 2026 ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత యువ జట్టు సాధించిన ఒక్క వికెట్ తేడా థ్రిల్లింగ్ విక్టరీ యావత్ దేశాన్ని ఉర్రూతలూగించింది. 338 పరుగుల లక్ష్య ఛేదనలో 252 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచిన వేళ.. టెయిలెండర్లు అద్భుతం చేసి భారత్‌కు రికార్డు స్థాయిలో 9వ ఆసియా కప్ టైటిల్‌ను అందించారు. ఈ విజయంపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) ఫిదా అయిపోయాడు. భారత కుర్రాళ్ల పోరాట పటిమను కొనియాడుతూ గంభీర్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పట్టుదలకు బ్యాటింగ్ ఆర్డర్ లేదు: గంభీర్
లక్ష్య రాయచందానీ సారథ్యంలోని భారత జట్టు వరుసగా వికెట్లు కోల్పోతున్నా ఏమాత్రం వెనక్కీ తగ్గకుండా పోరాడిన తీరుపై గంభీర్ X (ట్విట్టర్) వేదికగా స్పందించాడు.. అలుపేరుగని పోరాటం.. చెక్కుచెదరని నమ్మకం.. పట్టుదలకు బ్యాటింగ్ ఆర్డర్ ఉండదు (Grit has no batting order)!! ఆసియా ఛాంపియన్స్! వెల్ డన్ బాయ్స్! అంటూ గంభీర్ భారత యువ ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. 42వ ఓవర్లో 252/8 దగ్గర ఉన్న జట్టును మనల్ చౌహాన్ (47), మోహిత్ ఉల్వా (49 నాటౌట్) ఆఖరి బంతికి బౌండరీ బాది గెలిపించడం గంభీర్‌ను ఎంతగానో ఆకట్టుకుంది.
తండ్రికి తగ్గ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్:
ఈ ఫైనల్ పోరులో వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ (Aaryavir Sehwag) ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును గెలుచుకోవడమే కాకుండా, టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు.
* అద్భుత గణాంకాలు: ఈ టోర్నీలో 5 ఇన్నింగ్స్‌లు ఆడిన ఆర్యవీర్ 90.25 సగటుతో ఏకంగా 361 పరుగులు (ఒక సెంచరీ, 3 అర్ధశతకాలు) సాధించాడు. ఫైనల్లో కెప్టెన్ లక్ష్య రాయచందానీ (80)తో కలిసి తొలి వికెట్‌కు కేవలం 17.4 ఓవర్లలోనే 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఛేదనకు బలమైన పునాది వేశాడు.
* డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్ చెప్పిన ఆర్యవీర్: విజయం అనంతరం ఆర్యవీర్ మాట్లాడుతూ.. వికెట్ బ్యాటింగ్‌కు చాలా బాగుందని, 338 పెద్ద స్కోరు కాదని డ్రెస్సింగ్ రూమ్‌లో మాట్లాడుకున్నాం.. నార్మల్ షాట్లు ఆడితే సులభంగా ఛేదించగలమనే నమ్మకం మాకుంది. చివరి 10 ఓవర్లలో 100, 120 పరుగులు ఛేదించేలా మేము ముందుగానే ప్లాన్ చేసుకున్నాం.. కెప్టెన్ లక్ష్య లోతుగా బ్యాటింగ్ చేశాడు, చివర్లో మోహిత్, మనల్ చేసిన అద్భుతానికి హ్యాట్సాఫ్ అని పేర్కొన్నాడు.
Fearless cricket. Unshakable belief. Grit has no batting order !! Champions of Asia! Well done, boys! 🇮🇳🏆 https://t.co/n2mTAsZPHz
— Gautam Gambhir (@GautamGambhir) November 14, 2026
