నరాలు తెగే ఉత్కంఠ పోరులో పాక్పై భారత్ ఘన విజయం.. 

నరాలు తెగే ఉత్కంఠ పోరులో పాక్పై భారత్ ఘన విజయం.. 

చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ.. ఓడిపోతామనుకున్న మ్యాచ్‌లో అద్భుత పోరాటం.. వెరసి చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై టీమిండియా (Team India) యువ కెరటాలు చారిత్రాత్మక విజయాన్ని అందుకున్నాయి. అండర్-19 ఆసియా కప్ 2026 ఫైనల్లో పాకిస్థాన్‌ (Pakistan)పై భారత్ కేవలం ఒక్క వికెట్ తేడాతో సంచలన విజయం సాధించి ట్రోఫీని ముద్దాడింది. పాక్ నిర్దేశించిన 338 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన భారత కుర్రాళ్లు, 2025 అండర్-19 ఆసియా కప్ ఫైనల్ ఓటమికి దిమ్మతిరిగే ప్రతీకారం తీర్చుకున్నారు. 

ఆర్యవీర్ సెహ్వాగ్, రాయచందానీ మెరుపు ఆరంభం:

338 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. టీమిండియా అండర్–19 కెప్టెన్ లక్ష్య రాజేష్ రాయచందానీ (Lakshya Rajesh Raichandani) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి అద్భుత అర్ధశతకంతో ఛేదనకు గట్టి పునాది వేయగా, తన తండ్రి వీరేంద్ర సెహ్వాగ్ తరహాలోనే దూకుడుగా ఆడిన ఆర్యవీర్ సెహ్వాగ్ (Aaryavir Sehwag), కీలక హాఫ్ సెంచరీతో పాక్ బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. వీరిద్దరు ఓటైనా తర్వాత మిడిల్ ఆర్డర్ల బ్యాటర్లు తడబట్టారు. 

తడబడిన మిడిల్ ఆర్డర్.. ఆదుకున్న టెయిలెండర్లు: 

ఓపెనర్లు అవుటయ్యాక భారత మిడిల్ ఆర్డర్ ఒక్కసారిగా తడబడింది. వీకే వినీత్ (24), అర్జున్ రాజ్‌పుత్ (16), యశ్‌వర్ధన్ చౌహాన్ (9), అన్వయ్ ద్రవిడ్ (19) తక్కువ పరుగులకే వెనుదిరగడంతో భారత జట్టు ఓటమి అంచున నిలిచింది. కానీ ఇప్పుడే అసలు గేమ్ స్టార్ట్ అయింది. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో లోయర్ ఆర్డర్ బ్యాటర్లు మోహిత్ ఉల్వా (49 నాటౌట్) (Mohit Ulva), మనల్ చౌహాన్ (Manal Chauhan) (47) అసాధారణ పోరాటం చేశారు. పాక్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ జట్టును విజయతీరాలకు చేర్చారు. పాక్ బౌలర్లలో రిజ్వానుల్లా 3 వికెట్లు, నిఖాబ్ షఫీక్ 2 వికెట్లు, అలీ రజా, హస్నైన్ అబ్బాస్ దార్ తలో వికెట్ తీసినా భారత్ గెలుపును అడ్డుకోలేకపోయారు.