డ్రైవర్‌కు ఫిట్స్. .ఆటోను ఢీకొట్టి బైక్‌పైకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు

డ్రైవర్‌కు ఫిట్స్. .ఆటోను ఢీకొట్టి బైక్‌పైకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు

నర్సాపూర్: మెదక్ జిల్లా నర్సాపూర్‌లో సంగారెడ్డి–నర్సాపూర్ ప్రధాన రహదారిపై తృటిలో పెను ప్రమాదం తప్పింది.  స్కూల్ బస్సు నడుపుతున్న డ్రైవర్‌కు అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో బస్సు అదుపుతప్పి రోడ్డుపై వెళ్తున్న గూడ్స్ ఆటోను ఢీకొట్టింది. అనంతరం బైక్‌పైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో బైక్ బస్సు కింద ఇరుక్కుపోయింది.

అయితే ఈ ప్రమాదంలో పెను ముప్పు తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. బస్సులో ఉన్న విద్యార్థులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. తమ పిల్లలకు ఏమైందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందారు.

విద్యార్థులతో వెళ్తున్న పాఠశాల బస్సు డ్రైవర్‌కు ఫిట్స్ రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. విద్యార్థుల భద్రత విషయంలో పాఠశాల యాజమాన్యాలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.