మీరు ప్రతిరోజు చిన్న ప్రయాణాల కోసం తక్కువ ఖర్చు, డ్రైవింగ్ ఇబ్బంది లేని స్కూటీ కోసం చూస్తున్నట్లయితే, తక్కువ స్పీడుతో నడిచే ఎలక్ట్రిక్ స్కూటర్లు ఒక మంచి అప్షన్ అని చెప్పొచ్చు. భారతీయ నిబంధనల ప్రకారం, గంటకు 25 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్, 250kW వరకు మోటార్ పవర్ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్ లేదా RTO రిజిస్ట్రేషన్ అవసరం లేదు. తక్కువ వేగంతో నడిచే స్కూటర్‌ను నడపడానికి కనీస వయస్సు 16 సంవత్సరాలు కాబట్టి, 16 ఏళ్ల విద్యార్థులకు ఇదొక ఒక మంచి అప్షన్. మరి అలాంటి 5 స్కూటర్లు ఐవో ఇప్పుడు చూద్దాం...
లెక్ట్రిక్స్ EV ZYRO
లెక్ట్రిక్స్ EV జైరో అనేది గంటకు 25 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో వెళ్లగల ఒక లో-స్పీడ్ స్కూటర్. ఈ స్కూటర్ ఫ్రంట్ & రివర్స్ రైడింగ్ మోడ్లతో వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ జైరో LA (48V), జైరో LA 60V, జైరో LI అనే మూడు వేరియంట్లలో, 1.5kWh ఇంకా 1.54kWh అనే రెండు బ్యాటరీ ప్యాక్ అప్షన్లతో వస్తుంది. రేంజ్ పరంగా చూస్తే, జైరో LA (48V) 60 కిలోమీటర్ల రేంజ్‌ను, జైరో LA (60V) 75 కిలోమీటర్ల రేంజ్‌ను, జైరో LI 85 కిలోమీటర్ల రేంజ్ తో ఉంటాయి.
లెక్ట్రిక్స్ EV ZYRO ఇన్స్ట్రుమెంట్ కన్సోల్‌లో డిజిటల్ స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్మీటర్తో డిజిటల్ LED డిస్ప్లే ఉంటుంది. లైటింగ్ కోసం, ఇందులో LED హెడ్‌ల్యాంప్‌లు, LED DRLలు ఉన్నాయి. యాంటీ-థెఫ్ట్ అలారం & అలర్ట్‌లు, క్రూయిజ్ కంట్రోల్, లో- బ్యాటరీ అలర్ట్, ప్యాసింజర్ ఫుట్‌రెస్ట్ కూడా అందిస్తుంది. దీని ధరలు రూ.51,741 నుండి రూ.67,500 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
ఆంపియర్ రియో వైబ్
ఈ ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను నడపడానికి లైసెన్స్ అవసరం లేదు. ఈ స్కూటర్ 1.44kWh LFP బ్యాటరీతో పనిచేస్తుంది, దీని IDC రేంజ్ 80 కి.మీ, టాప్ స్పీడ్ గంటకు 25 కి.మీ. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 250-వాట్ BLDC హబ్ మోటార్‌తో పనిచేస్తుంది, దీని పీక్ టార్క్ 35Nm/km. ఆంపియర్ రియో వైబ్ బరువు 74 కిలోలు, దీని గ్రౌండ్ క్లియరెన్స్ 140mm.
ఇందులో 3.5-అంగుళాల కలర్ LCD డిస్ప్లేతో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. కీలెస్ స్టార్ట్/రిమోట్ లాక్-అన్‌లాక్, రివర్స్ అసిస్ట్ మోడ్, USB ఛార్జింగ్ పోర్ట్, 24-లీటర్ల పెద్ద బూట్ స్పేస్ అందిస్తుంది. భారతీయ తక్కువ-స్పీడ్ EV నిబంధనల ప్రకారం దీనికి లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ అవసరం లేదు, దీని ధర రూ.71,999 (ఎక్స్-షోరూమ్).
ఒకినావా R30
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 250W BLDC హబ్ మోటార్‌తో పనిచేస్తుంది, ఒకినావా R30 టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు, దీనివల్ల దీనిని నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. ఒకే ఫుల్ ఛార్జ్‌పై 60 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. 1.25 లేదా 1.34kWh లిథియం-అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఆటో-కట్ ఫంక్షన్ ఉన్న మైక్రో ఛార్జర్‌ను ఉపయోగించి ఛార్జింగ్ చేయడానికి 4 నుండి 5 గంటల సమయం పడుతుంది.
ఒకినావా R30లో డిజిటల్ స్పీడోమీటర్, ట్రిప్‌మీటర్, పుష్-బటన్ స్టార్ట్ ఫీచర్లు ఉన్నాయి. లైటింగ్ ఆప్షన్లలో స్టైలిష్ హెడ్‌లైట్, టెయిల్‌లైట్ ఉన్నాయి. పెర్ల్ వైట్, గ్లాసీ రెడ్, మెటాలిక్ ఆరెంజ్, సీ గ్రీన్ & సన్‌షైన్ ఎల్లో రంగులలో లభిస్తుంది. ఒకినావా R30 ధర రూ.61,998 (ఎక్స్-షోరూమ్).
సోకుడో ప్లస్
సోకుడో ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 25 కి.మీ. (లో-స్పీడ్ వేరియంట్), BLDC హబ్ మోటార్‌తో పనిచేస్తుంది. ఎకో, నార్మల్, స్పోర్ట్ రైడింగ్ మోడ్లతో పాటు రివర్స్ గేర్ కూడా అందిస్తుంది. సోకుడో ప్లస్ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీతో పనిచేస్తుంది, ఒకే ఛార్జ్‌పై 100 కి.మీ.ల వరకు ప్రయాణిస్తుంది. అలాగే 5-6 గంటల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. 235mmతో అద్భుతమైన గ్రౌండ్ క్లియరెన్స్ కూడా అందిస్తుంది.
సోకుడో ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్లో అల్లాయ్ వీల్స్, ముందు డిస్క్, వెనుక డ్రమ్ బ్రేకులు, ట్యూబ్‌లెస్ టైర్లు ఉన్నాయి. ఇందులో LED హెడ్‌లైట్, డిజిటల్ స్పీడోమీటర్, ఓడోమీటర్ ఉన్నాయి. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.67,951. నలుపు, ఆరెంజ్/రెడ్ అనే మూడు కలర్స్ లో లభిస్తుంది.
కైనెటిక్ గ్రీన్ జింగ్
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 250W BLDC హబ్ మోటార్‌తో పనిచేస్తుంది, 60Nm టార్క్, గంటకు 25 కిలోమీటర్ల స్పీడ్ తో ప్రయాణిస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వచ్చే కైనెటిక్ గ్రీన్ జింగ్‌లో రిమోట్ స్టార్ట్, పుష్-బటన్ స్టార్ట్ ఫీచర్లు ఉన్నాయి. 1.4kWh నుండి 1.7kWh బ్యాటరీతో పనిచేస్తుంది, ఒకే ఛార్జ్‌పై 70 నుండి 100 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీనిని ఛార్జ్ చేయడానికి 3 నుండి 4 గంటల సమయం పడుతుంది.
కైనెటిక్ గ్రీన్ జింగ్‌లో పూర్తి LED లైటింగ్ సెటప్, డిజిటల్ స్పీడోమీటర్, ఓడోమీటర్, బ్యాటరీ-లో ఇండికేషన్ ఫీచర్స్ ఉన్నాయి. USB ఛార్జింగ్ పోర్ట్, సీటు కింద స్టోరేజ్, మల్టీ-ఫంక్షన్ లాక్ & యాంటీ-థెఫ్ట్ అలర్ట్‌తో రీజెనరేటివ్ బ్రేకింగ్ వంటి ఫీచర్లను అందిస్తుంది. ఈ లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.71,990 నుండి రూ.79,990 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.
ఈ ధరలు ఎక్స్-షోరూమ్ ధరలు మాత్రమే. మీ నగరాన్ని బట్టి ధరలు మారవచ్చు. అలాగే లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదనే విషయం స్కూటర్ టాప్ స్పీడ్ 25 కి.మీ./గంట ఉండటంతో మాత్రమే నిర్ణయించబడదు. మోటార్ పవర్ 250W మించకపోవడం సహా కేంద్ర మోటార్ వాహన నిబంధనల్లోని అన్ని షరతులను ఆ మోడల్ పాటించాలి. కొనుగోలు చేసే ముందు డీలర్ వద్ద నిర్ధారించుకోవడం మంచిది.
