గిగ్ వర్కర్ల బహిరంగ సభలో వేదికపై రాహుల్ గాంధీ, మంత్రి వివేక్ వెంకటస్వామి ముచ్చట

గిగ్ వర్కర్ల బహిరంగ సభలో వేదికపై రాహుల్ గాంధీ, మంత్రి వివేక్ వెంకటస్వామి ముచ్చట

హైదరాబాద్: హైదరాబాద్లో జరిగిన గిగ్ వర్కర్ల బహిరంగ సభలో రాహుల్ గాంధీ, మంత్రి వివేక్ వెంకటస్వామి వేదికపై ముచ్చటించుకున్నారు. కార్మిక సంక్షేమ శాఖ మంత్రిగా వివేక్ వెంకటస్వామి ఆయన దృష్టికొచ్చిన గిగ్ వర్కర్ల సమస్యలను రాహుల్ గాంధీకి వివరించారు. రాహుల్ గాంధీ కూడా మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పిన విషయాలను ఓపికగా విన్నారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి సభలో మాట్లాడుతూ.. గిగ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత లేదని, ఎప్పుడు పని ఇస్తారో ఎప్పుడు తీసేస్తారో తెలియని దుస్థితిలో ఉన్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

ఇన్సెంటివ్స్ కోసం సంస్థలు పెట్టే '10 నిమిషాల డెలివరీ’ నిబంధనతో కార్మికులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, వేగంగా వెళ్తూ ప్రమాదాల్లో చనిపోయినా, గాయపడినా రక్షణ, బీమా దక్కడం లేదని చెప్పారు. వీళ్లు తమ రెగ్యులర్ ఉద్యోగులు కాదని ఉబెర్ వంటి సంస్థలు మొదట బాధ్యత నుంచి తప్పుకోవాలని చూశాయని, వాటికి నచ్చజెప్పి చట్ట పరిధిలోకి తెచ్చామని వివరించారు. కనీస వేతనాల విధానం లాగే గిగ్ వర్కర్ల చట్టం కూడా దేశానికే దిక్సూచిగా నిలుస్తుందన్నారు.