జేఈఈ-అడ్వాన్స్‌డ్ 2027 ఎగ్జామ్ డేట్ ఫిక్స్

జేఈఈ-అడ్వాన్స్‌డ్ 2027 ఎగ్జామ్ డేట్ ఫిక్స్

న్యూఢిల్లీ: దేశంలోని ఐఐటీల్లో ప్రవేశాలకు కోసం నిర్వహించే జేఈఈ-అడ్వాన్స్‌డ్‌ పరీక్ష తేదీ ఖరారైంది. 2027, మే 23న జేఈఈ-అడ్వాన్స్‌డ్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు ఐఐటీ ఢిల్లీ ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం (నవంబర్ 13) ఒక ప్రకటన విడుదల చేసింది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో జరిగే జేఈఈ-అడ్వాన్స్‌డ్‌కు హాజరయ్యే అభ్యర్థులకు 10-12 అంకెల డిస్‌ప్లేతో కూడిన ఆన్-స్క్రీన్ బేసిక్ (నాన్-సైంటిఫిక్) కాలిక్యులేటర్‌ను ఉపయోగించుకునే సదుపాయం ఉంటుందని తెలిపింది. 

JEE-Mainలో అత్యధిక స్కోరు సాధించిన 2.5 లక్షల మంది అభ్యర్థులు JEE-Advancedకు హాజరయ్యేందుకు అర్హత పొందుతారు. ఒక అభ్యర్థి వరుసగా రెండు సంవత్సరాలలో గరిష్ఠంగా రెండు సార్లు మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్ రాయడానికి అర్హులు. అభ్యర్థులు ఇంటర్మీడియట్ (12వ తరగతి) లేదా తత్సమాన పరీక్షలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ప్రధాన సబ్జెక్టులుగా ఉత్తీర్ణులై ఉండాలి. 

పరీక్షను రెండు పేపర్లుగా నిర్వహిస్తారు. పేపర్-1 (ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు), పేపర్-2 (మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 వరకు) అనే రెండు భాగాలు ఉంటాయి. అభ్యర్థులు ఈ రెండు పేపర్లకు తప్పనిసరిగా హాజరు కావాలి. ప్రతి పేపర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.