విశాఖ: CII సదస్సులో 194 MoUలు, రూ.9.98 లక్షల కోట్ల పెట్టుబడులను ఆహ్వానించినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలని సదస్సు ముగింపు ప్రసంగంలో సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.
భవిష్యత్‌లో 50 శాతం పారిశ్రామికవేత్తలు మహిళలే ఉంటారని, AI, ఏరోస్పేస్, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో ఏపీ ముందడుగు వేస్తుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. పెట్టుబడిదారుల రక్షణ కోసం త్వరలో ప్రత్యేక చట్టం తీసుకొస్తామని సీఎం చెప్పారు.
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. ఏపీతో పలు కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయని, సీఎం చంద్రబాబు ఎప్పుడూ భవిష్యత్ గురించి ఆలోచిస్తారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పడం గమనార్హం. హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధికి చంద్రబాబుదే కీలక పాత్ర అని కేంద్ర మంత్రి కొనియాడారు. రూఫ్‌టాప్ సోలార్‌లో ఏపీ దేశానికే ఆదర్శమని, 7.86 లక్షల ఇళ్లకు సోలార్ ఏర్పాటు అభినందనీయమని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు.
