హైదరాబాద్: హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సేవలందించిన వీసీ సజ్జనార్ వీడ్కోలు సందేశం ఇచ్చారు. ఏడాదిగా సీపీ ప్రయాణం మర్చిపోలేనని సజ్జనార్ చెప్పారు. కొత్త సీపీ మహేష్ భగవత్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. పోలీసుల సమిష్టి కృషితోనే పనిచేశానని తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో ఫేర్వెల్ సందేశం ఇచ్చారు.
సీపీగా తనకు అవకాశం కల్పించిన సీఎం, సర్కార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మత సామరస్యానికి ప్రతీక మన హైదరాబాద్ అని, ప్రజలంతా కలిసిమెలిసి, శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రతి పండుగనూ ఘనంగా జరుపుకున్న తీరు తన మనసును ఎంతగానో కదిలించిందని సజ్జనార్ చెప్పారు.
ప్రజల క్షేమమే పరమావధిగా తాము అనేక అడుగులు వేశామని, ముఖ్యంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఆహార కల్తీపై ‘హెచ్-ఫాస్ట్’ ద్వారా ఉక్కుపాదం మోపామని సజ్జనార్ గుర్తుచేశారు. భారీ ఎత్తున కల్తీ ఆహారాన్ని సీజ్ చేసి, నిందితులను కటకటాల వెనక్కి నెట్టే ప్రయత్నంలో మాకు అండగా నిలిచిన ఫుడ్ సేఫ్టీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
మరోవైపు, సైబర్ నేరాల కట్టడి కేవలం పోలీసుల వల్లే కాదని గుర్తించి.. ప్రజల్లో చైతన్యం తెస్తూనే బ్యాంకులు, DoT వంటి విభాగాలను సమన్వయం చేస్తూ దేశవ్యాప్తంగా ‘ఆపరేషన్ ఆక్టోపస్’కు శ్రీకారం చుట్టామని వివరించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోం సెక్రటరీ గారు ప్రత్యేకంగా స్పందించి.. మన హైదరాబాద్ సిటీ పోలీస్ ఇచ్చిన సలహాలను స్వీకరించి ప్రశంసించడం మనందరికీ దక్కిన గౌరవం అని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ALSO READ : మిగతా పార్టీలను శత్రువులుగా చేసే ధోరణి ప్రజాస్వామ్యానికి విరుద్ధం
ఇక నగరవాసులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే జీహెచ్ఎంసీ కమిషనర్, ఇతర అధికారుల సహకారంతో విజయవంతంగా అమలు చేసి ట్రాఫిక్ సమస్యలకు ఉపశమనం కలిగించామని ఆయన తెలిపారు. ఈ విజయాలన్నింటి వెనుక పోలీస్ కుటుంబం పడిన కష్టం దాగుందని, ఉత్తమ పనితీరు కనబరిచిన సిబ్బందిని గుర్తించే ‘ఎక్స్ట్రా మైల్’, వారి ఆరోగ్య రక్షణ కోసం ‘గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్’ వంటి కార్యక్రమాలు వారి త్యాగాలకు తామిచ్చిన చిరు కానుకలు అని సజ్జనార్ చెప్పారు.
