జ్యోతిష్యం: సింహరాశిలో గురుడు సంచారం.. 2027 జనవరి 25 వరకు వీరు పట్టింది బంగారమే..!

 జ్యోతిష్యం:  సింహరాశిలో గురుడు సంచారం.. 2027 జనవరి 25  వరకు వీరు పట్టింది బంగారమే..!

 జ్యోతిషశాస్త్రంలో గురు గ్రహ సంచారానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. . జీవితం అన్ని విధాలా సాఫీగా, హ్యాపీగా సాగిపోవాలంటే గురుడి అనుగ్రహం చాలా అవసరం. అంతటి ప్రాముఖ్యత ఉన్న గురుడు  సింహరాశిలో వచ్చే ఏడాది అంటే 2027 జనవరి 25 వతేదీ వరకు సంచరించనున్నాడు. ఈ ప్రభావంతో ఐదు రాశుల  ( మేష, కర్కాటక, సింహం,  ధనస్సు, కుంభ) వారికి అన్ని విధాలా కలిసి వస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  ఇప్పుడు ఆ రాశుల వివరాల గురించి తెలుసుకుందాం . . .!

మేషరాశి:  వచ్చే ఏడాది 2027 జనవరి 25 వరకు గురుడు సింహరాశిలో సంచారం చేయనున్నాడు.  దీని ఈ రాశివారికి ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది.  ధైర్య సాహసాలకు తగిన ప్రతిఫలం లభిస్తుంది.ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి.  వృత్తి, ఉద్యోగాల్లో మీ సలహాలు, సూచనలు బాగా కలిసి వస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వ్యాపారాల్లో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది. సమాజంలో గౌరవం కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.  వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు పెడితే ఊహించని లాభాలు కలుగుతాయి. ప్రేమ..పెళ్లి వ్యవహారాలు కలిసి వస్తాయి.  నిరుద్యోగులు ఆశించిన శుభవార్త వింటారు. పూర్వీకుల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

కర్కాటకరాశి: సింహరాశిలో గురుడు 2027 జనవరి 25 వ తేదీవరకు అదే రాశిలో సంచారం చేయనున్నాడు, పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఈ రాశి వారికిసమాజంలో గౌరవం పెరుగుతుంది, హోదా పెరుగుతుంది. ఆఫీసులో మీ ఇమేజ్ మరింత బలపడుతుంది.వృత్తి, వ్యాపార పరంగా ప్రయోజనకరంగా ఉండవచ్చని జ్యోతిష్య అంచనాలు సూచిస్తున్నాయి. ఉద్యోగులకు పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం లభించవచ్చు. కొత్త ప్రణాళికలు రూపొందించి వాటిని అమలు చేయడం ద్వారా ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. . ఉద్యోగం మారాలని ఆలోచించే వారికి అనుకూలమైన వాతావరణం ఉంది. సరైన సమయంలో పెట్టే పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. దర్జాగా, గౌరవప్రదంగా జీవితం గడిపే అవకాశం ఉంది.అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. నిరుద్యోగులకు తప్పకుండా ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు కలసి వస్తాయి

సింహరాశి:  ఇదే రాశిలో గురుడు వచ్చే ఏడాది జనవరి 25 వ తేది వరకు సంచారం చేయనున్నాడు. దీని వలన ఈ రాశి వారికి  వ్యక్తిత్వం ఎంతగానో వికసిస్తుంది. ఉపాధి, వ్యాపార రంగాల్లో అద్భుతమైన  పురోగతిని సాధిస్తారు.శ్రమ తక్కువ లాభం ఎక్కువగా ఉంటుంది. ఆదాయం పెరిగి వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.  వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అంచనాలను మించిన పురోగతి ఉంటుంది. మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలోనే ఉన్నత స్థాయి వెళ్లే అవకాశం కూడా ఉంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయని పండితులు చెబుతున్నారు.  ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలపి జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. 

►ALSO READ | పుట్టలో పాలు పోస్తూ ఈ మంత్రాలు చదవండి...సంతానం లేనివారికి పిల్లలు పుడతారు..!

ధనస్సురాశి: సింహరాశిలో గురుడు వచ్చే ఏడాది జనవరి 25 వతేదీ వరకు సంచారం చేయడం వలన ఈ రాశి వారికిపెండింగ్ పనులన్నీ చకచకా పూర్తవుతాయి. కుటుంబంలో ఆనందం వెల్లి విరుస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.ఈ సమయంలో మాటతీరుతో ఇతరులను ఆకట్టుకునే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో చర్చలు సానుకూలంగా సాగి కీలక ఒప్పందాలు కుదిరే సూచనలు ఉన్నాయి. బ్యాంకు నిల్వలు పెరగడంతో పాటు గతంలో చేసిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వచ్చే అవకాశముంది. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక సామాజికంగా కూడా హోదా, స్థాయి పెరుగుతాయి. మాటకు, చేతకు విలువ ఏర్పడుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంతానానికి సంబంధించిన దీర్ఘకాలిక ఆందోళనలు తొలగి కుటుంబంలో ప్రశాంతత నెలకొనవచ్చని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి.

కుంభరాశి:  గురుడు సింహరాశిలో వచ్చే ఏడాది జనవరి 25 వ తేది వరకు సంచారం చేయనున్నాడు. దీని ప్రభావంతో ఈ రాశి వారికి అనేక విధాలుగా మేలు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా గతంలో నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికి అందే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొత్త అవకాశాలు వచ్చే అవకాశాలున్నాయి.  చేతి వృత్తుల వారికి అనుకోకుండా ఆర్డర్లు వస్తాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలున్నాయి. గతంలో నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికి అందుతుంది.  నిరుద్యోగులు కొద్ది ప్రయత్నంతో మంచి ఉద్యోగంలో చేరడం జరుగుతుంది.కొత్త పనులు ప్రారంభించాలనుకునే వారికి  ఈ సమయం చాలా అనుకూలమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.