అమెరికన్ మల్టీ నేషనల్ టెక్నాలజీ కంపెనీ Nvidiaకు 33 ఏళ్లపాటు నాయకత్వం వహించిన జెన్సెన్ హువాంగ్ గురువారం CEO పదవికి రాజీనామా చేశారు. ఆయనపై వివాహేతర సంబంధాలకు సంబంధించిన ఆరోపణలు వెలుగులోకి రావడంతో ఆయన తన పదవిని వదులుకోవాల్సి వచ్చింది.
చైనా తరఫున గూఢచర్యానికి పాల్పడిందని అనుమానాలున్న ఒక మహిళతో ఆయనకు సంబంధం ఉందని అమెరికా అధికారులు భావిస్తున్నట్లు నివేదికలు వెల్లడించాయి. Nvidia బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు గురువారం కీలక ప్రకటన విడుదల చేసింది. Nvidia CEO, ప్రెసిడెంట్, బోర్డ్ మెంబర్ పదవుల నుంచి జెన్సెన్ హువాంగ్ తప్పుకున్నారని ఈ ప్రకటనలో డైరెక్టర్స్ బోర్డ్ తెలిపింది.
#BreakingNews | Jensen Huang resigns as Nvidia CEO effective immediately Chief Financial Officer Colette Kress has been appointed as interim CEO while keeping her existing roles. #JensenHuang #Nvidia #NvidiaCEO https://t.co/t3zRFXj0HZ
— All India Radio News (@airnewsalerts) November 12, 2026
ఆయన స్థానంలో CFO కొలెట్ క్రెస్‌ను తాత్కాలిక CEOగా నియమించినట్లు కంపెనీ ప్రకటించింది. క్రెస్ సెప్టెంబర్ 2013 నుంచి Nvidiaలో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, CFO గా పనిచేస్తున్నారు. బోర్డ్ కొత్త చైర్‌పర్సన్‌గా హార్వీ సీ జోన్స్‌ను నియమించింది. ఆయనకు పారిశ్రామికవేత్తగా, టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్గా, వెంచర్ ఇన్వెస్టర్‌గా 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది.
Synopsys CEO, ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా కూడా ఆయన పని చేశారు. కొత్త సీఈవో క్రెస్ మాట్లాడుతూ.. హువాంగ్ 33 ఏళ్లలో వేసిన పునాదిపై కంపెనీని ముందుకు నడిపిస్తానని, యాక్సిలరేటెడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కంపెనీని మరింత వృద్ధిలో నడిపించేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు.
►ALSO READ | NRIని టార్గెట్ చేసి రూ.2 కోట్లు కొట్టేసిన సైబర్ మోసగాళ్లు.. ఫారెక్స్ ట్రేడింగ్ మోసం
హువాంగ్‌పై గత కొద్ది రోజులుగా ఒత్తిడి పెరుగుతూ వచ్చింది. 63 ఏళ్ల హువాంగ్ వివాహితుడు. అయినా.. చైనాకు చెందిన మహిళా వ్యాపారవేత్తతో వివాహేతర సంబంధం కొనసాగించారని, ఆ మహిళను అమెరికా అధికారులు బీజింగ్ తరఫున గూఢచర్యం చేస్తున్నారని అనుమానిస్తున్నారని నివేదికలు వచ్చాయి. అంతేకాదు.. తనకు నేరుగా రిపోర్ట్ చేసే ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్‌తో కూడా ఆయనకు వివాహేతర సంబంధం ఉందని మరిన్ని రిపోర్టులు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో.. Nvidia బోర్డ్ బుధవారం సమావేశమై హువాంగ్‌ను తొలగించే అంశంపై చర్చించినట్లు సమాచారం.
4 ట్రిలియన్ డాలర్ల విలువైన Nvidia కంపెనీలో హువాంగ్ నిష్క్రమణతో అనిశ్చితి నెలకొంది. ఆయన AI ఎకోసిస్టమ్‌లో Nvidiaకి ప్రత్యేక స్థానం దక్కేందుకు కృషి చేశారు. క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లు, సప్లయర్లు, పరిశోధన ల్యాబ్‌లకు నిధులు అందించే విధంగా కంపెనీని తీర్చిదిద్దారు. ఇదిలా ఉండగా.. Nvidia తన 2027 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఫలితాలను నవంబర్ 17న ప్రకటిస్తుందని తెలిపింది.
