పండుగల సీజన్ ముగిసిన తర్వాత కార్తీక మాసంలో బంగారం రేట్లు ఊహించని రీతిలో పతనం అవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యంతర ఎన్నికల ఓటిమితో దూకుడు నిర్ణయాలు తగ్గించటంతో మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఆందోళనలు తగ్గటంతో అంతర్జాతీయంగా అనేక పరిణామాలు ఆర్థికంగా సానుకూలతతో ముందుకు సాగుతున్నాయి. ఇది బులియన్ మార్కెట్లపై కూడా ప్రభావం చూపుతోందని.. బంగారం, వెండి ధరలు రికార్డు రేట్ల నుంచి అందుబాటు ధరల్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో షాపింగ్ చేద్దాం అనుకుంటున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుగా తమ నగరాల్లోని తగ్గిన రిటైల్ విక్రయ ధరలను పరిశీలించటం బెటర్.
నవంబర్ 12న బంగారం రేట్లు తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు 218 రూపాయలు తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.13వేల 980గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.12వేల 815గా కొనసాగుతోంది.
గురువారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. నవంబర్ 12, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కూడా స్వచ్ఛమైన వెండి కేజీకి రూ.2లక్షలుగా కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.200 దగ్గర ఉంది. భవిష్యత్తులో రేట్లు ఇంకా తగ్గొచ్చని అంచనాలు ఉన్నాయి.
