భారత్ సమిట్ ఉద్దేశం మతవాదులకు అర్థం కాదు: ఎమ్యెల్యే మేడిపల్లి సత్యం, విప్ అద్దంకి

భారత్ సమిట్ ఉద్దేశం  మతవాదులకు అర్థం కాదు:  ఎమ్యెల్యే మేడిపల్లి సత్యం, విప్ అద్దంకి

దేశ వ్యతిరేకమైతే కేంద్రం ఎలా అనుమతి ఇచ్చింది? :  విప్ అద్దంకి 
 
హైదరాబాద్, వెలుగు:రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్‌‌‌‌పై బీజేపీ స్టేట్​చీఫ్​ రాంచందర్ రావు విషం కక్కుతున్నారని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఫైర్ అయ్యారు. భారత్ సమ్మిట్ లోనే భారత్ అనే పదం ఉంది.. అలాంటప్పుడు ఇది యాంటీ భారత్ ఎలా అవుతుందో రాంచందర్ రావు చెప్పాలని డిమాండ్​ చేశారు. 70 దేశాలకు చెందిన ప్రతినిధులు, ముఖ్యంగా ప్రగతిశీల భావాలు కలిగిన వ్యక్తులు, సంస్థలు ఇందులో భాగస్వాములు అవుతున్నారని తెలిపారు. కులం, మతం పేరు చెప్పుకొని బతికే బీజేపీకి ఇలాంటి సమ్మిట్‌‌ల ఉదాత్తమైన ఉద్దేశాలు ఎప్పటికీ అర్థం కావని విమర్శించారు. 

ప్రధాని, హోంమంత్రి తప్పు చేశారా?

భారత్ సమ్మిట్ దేశ వ్యతిరేకమైతే  కేంద్రం ఎలా అనుమతిచ్చిందని విప్ అద్దంకి  దయాకర్ ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తప్పు చేశారా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పాలని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన సీఎల్పీలో మాట్లాడారు.