ఫ్లెక్సీ బాండ్ అంటుకొని.. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కాలికి గాయం..

ఫ్లెక్సీ బాండ్ అంటుకొని.. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కాలికి గాయం..

వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కాలికి గాయం అవ్వడంతో ఆసుపత్రికి తరలించారు. బుధవారం ( నవంబర్ 11 ) రాజన్న సిరిసిల్ల జిల్లా కథలాపూర్ మండలం ఇప్పపల్లిలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయనకు అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీకి ఉపయోగించిన ఫ్లెక్సీ బాండ్ అంటుకొని కాలికి గాయం అయ్యింది. 

కాలికి తీవ్ర నొప్పి కావడంతో వెంటనే వేములవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు ఫ్లెక్సీ బాండ్ ను తొలగించి  చికిత్స అందించారు వైద్యులు. ఈ విషయం తెలుసుకున్న ఆది శ్రీనివాస్ అనుచరులు, అభిమానులు భారీగా ఆసుపత్రికి చేరుకుంటున్నారు.