Super Snacks: కాలిఫ్లవర్ పకోడి.. జస్ట్ పదే పదినిమిషాల్లో తయారీ..టేస్ట్ అదుర్స్

Super Snacks: కాలిఫ్లవర్ పకోడి.. జస్ట్ పదే పదినిమిషాల్లో తయారీ..టేస్ట్ అదుర్స్

చలి ముదురుతుంది. పగలు ఎండు ఉన్నా.. సాయంత్రం సమయానికి చలిపెడుతుంది.  ఈ సమయంలో వేడి వేడిగా  ఏమైనా తింటే హాయిగా ఉంటుంది.  ఎప్పుడూ రొటీన్​ ఉల్లి పకోడి... బజ్జి లాంటివి తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది.  ఈ సారి వెరైటీగా గోబీ అదేనం కాలిఫ్లవర్​పకోడీని ట్రై చేద్దామామరి.. ఇది ఎంతో ఆరోగ్యం కూడా.. ఇప్పుడు ఈ వెరైటీ స్నాక్స్​ ను ఎలా తయారు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . !

ఒక్కోసారి ఇంటికి అనుకోకుండా గెస్ట్​ లు వస్తుంటారు. బజారున పోతూ పోతూ ఒక్కసారి పలకరించి వెళ్దామనుకుంటారు.  అలా వచ్చిన వారికి జస్ట్​ పదే పది నిమిషాల్లో గోబి పకోడి పెడితే చాలా వెరైటీగా ఉంటుందిగా మరి..!

కాలిఫ్లవర్ పకోడి తయారీకి కావలసినవి

  • కాలీఫ్లవర్ ముక్కలు: రెండు కప్పులు
  • ఉప్పు: రుచికి సరిపడ
  • గుడ్లు -: రెండు
  • కార్న్ ఫ్లోర్ : ఒక కప్పు
  • నూనె: వేయించడానికి సరిపడ

కాలీఫ్లవర్ ఫ్రై తయారీ విధానం

ముందుగా కాలిఫ్లవర్​ పువ్వును చిన్న చిన్న ముక్కలుగా కట్​ చేయాలి.  వీటిని ఒక గిన్నెలో వేసి అవి మునిగేలా నీళ్లు పోయాలి.  ఈ నీళ్లలో ఒక టీస్పూన్​ ఉప్పు వేసి మురికిపోయేలా శుభ్రంగా కడిగి  ఆ ముక్కలను వేరే గిన్నెలోకి తీసుకోవాలి.  

ఇప్పుడు మరో గిన్నె తీసుకొని అందులో గుడ్ల సొన వేయాలి.   ఇందులో కార్న్​ ఫ్లోర్​ వేసి ఉండలు లేకుండా పెరుగు మాదిరిగా చిక్కగా వచ్చే వరకు  బాగా కలపాలి. 

►ALSO READ | నిమ్మతొక్కలు పడేస్తున్నారా.. అయితే మీరు చాలా నష్టపోతున్నారు.!

ఇప్పుడు కాలిఫ్లవర్​ ముక్కలను ఒక ప్లేట్​లో సమానంగా ఉంచాలి. ఈ ముక్కలపై కార్న్​ప్లోర్​ గుడ్ల సొన మిశ్రమాన్ని ఆ ముక్కలకు మందపాటి పొరలా అంటేలా చేతులతో బాగా కలపాలి. 

ఇప్పుడు స్టవ్​ వెలిగించి డీప్​ ఫ్రైకి సరిపడా నూనెను కళాయిలో పోసి వేడి చేయాలి.  ఆ తరువాత పిండి పట్టించిన ముక్కలను ఒక్కొక్కటిగా బంగారు రంగులోకి వచ్చేవరకు  కరకరలాడే వరకు వేయించాలి.    వీటిని ఒకప్లేట్​ లోకి తీసుకోవాలి.అంతే క్రిస్పీ కాలిఫ్లవర్​ పకోడి రడీ.. 

వీటిని సర్వ్ చేసేటప్పుడు వీటిపైన  పెరిపెరి మసాలా కానీ, చాట్ మసాలా కానీ చల్లండి. ఎంతో ఇష్టంగా లాగించేస్తారు