అన్నా లెజినోవా ఆస్తులు ఇన్ని వేల కోట్లా : సింగపూర్ లో హోటళ్లు ఉన్నాయా..?

అన్నా లెజినోవా ఆస్తులు ఇన్ని వేల కోట్లా : సింగపూర్ లో హోటళ్లు ఉన్నాయా..?

పవన్ కల్యాణ్, అన్నా లెజినోవా విడాకులు తీసుకున్నారు. అధికారికంగా ప్రకటించారు. అంత వరకు ఓకే.. ఇప్పుడు ఎవరి దారి వాళ్లదే.. అది కూడా ఓకే. పవన్ కల్యాణ్ నుంచి విడాకులు తీసుకున్న మూడో భార్య అన్నా లెజినోవాకు ఉన్న ఆస్తులు ఎంత.. ఆమెకు ఏయే దేశాల్లో ఆస్తులు ఉన్నాయి అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. జాతీయ బిజినెస్ వెబ్ సైట్ మనీ కంట్రోల్ లో వచ్చిన కథనం చూస్తే.. అన్నా లెజినోవాకు ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయా అని అందరూ నోరెళ్లబెడుతున్నారు. ఇంతకీ అన్నా లెజినోవాకు ఉన్న ఆస్తుల వివరాలు పూర్తిగా తెలుసుకుందాం..

రష్యాన్ పౌరురాలైన అన్నాలెజినోవా 1980 జన్మించారు.సెయింట్ పీటర్స్‌బర్గ్ యూనివర్సిటీలో ఓరియంటల్ స్టడీస్‌లో చదివిన ఆమె, 2024లో సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ అందుకున్నారు.  మోడల్ గా, నటిగా రాణించిన ఆమెకు భారీగానే ఆస్తులు ఉన్నాయి. హైదరాబాద్, సింగపూర్, రష్యాలలో సుమారు రూ. 1,800 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు సమాచారం.

ముఖ్యంగా సింగపూర్, రష్యాల్లో అనేక హోటళ్లను కలిగి ఉందని సమాచారం. అంతే కాదు , విద్యా రంగాల్లో కూడా పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. నిజానికి అన్నా లెజినోవా పుట్టుకతోనే కోటీశ్వరాలు. వాళ్ల తండ్రి రష్యాలో పెద్ద బిజినెస్ వ్యాన్ అని సమాచారం.

ఇక పవన్ కళ్యాణ్ కుటుంబ ఆస్తులు చూస్తే 2024 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం మొత్తం సుమారు రూ. రూ. 164.5 కోట్లు ఉన్నట్లు  వెల్లడించారు. తన భార్య అన్నా పేరు మీద కోటి విలువైన ఆస్తితో పాటు తమకు 46 కోట్ల విలువైన చరాస్థులు ఉన్నట్లు పవన్ కళ్యాణ్ ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. ఈ లెక్కన పవన్ కళ్యాణ్ కంటే అన్నాలేజినోవా కు చాలా రెట్లు ఆస్తున్నాయి. 

ఇక 2011లో పవన్ కళ్యాణ్ నటించిన 'తీన్ మార్' సినిమా సమయంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి 2013 సెప్టెంబర్ 30న వివాహ బంధంతో ఒక్కటయ్యారు.   వీనిరి అంజనా పవనోవా అనే కుమార్తె, మార్క్ శంకర్ పవనోవిచ్ అనే కుమారుడు ఉన్నారు. నవంబర్ 9, 2026న పవన్, అన్నా పరస్పర అవగాహనతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. పిల్లల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.